iDreamPost

రాయల సీమ.. రతనాల సీమే..!

రాయల సీమ.. రతనాల సీమే..!

రాయల సీమ రతనాల సీమ అనే మాటను తరచూ వింటుంటాం. కవులు, కళాకారులు, రాజకీయ నేతలు, సినిమాల్లోనూ ఈ మాటను సందర్భానుసారం ఉపయోగిస్తుంటారు. అయితే ఈ తరం సీమలో కరువు తప్పా.. రతనాలు చూసింది తక్కువ. అయితే రాయలసీమ ఇప్పుడు కరువు సీమే కానీ ఒకప్పుడు రతనాల సీమ అనే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో తాజాగా ఇద్దరికి రెండు వజ్రాలు లభించడం రాయల సీమ రతనాల సీమ అని రుజువవుతోంది.

కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పగిడిరాయి, బొల్లవానిపల్లె గ్రామాల్లోని పొలాల్లో వజ్రాలు స్థానికులకు దొరికాయి. బొల్లవాని పల్లెలో ఓ గొర్రెల కాపరికి వజ్రం దొరకింది. దానిని ఓ వ్యాపారి 50 వేల రూపాయల నగదు, రెండు తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశాడు. అదే విధంగా పగిడి రాయిలో ఓ వ్యవసాయ కూలీకి వజ్రం దొరకగా.. దాన్ని జొన్నగిరికి చెందిన ఓ వ్యాపారి 1.50 లక్షల రూపాయాలకు కొనుగోలు చేశారు.

వజ్రాలు దొరకడం ఆ ప్రాంతంలో హాట్‌టాపిక్‌గా మారింది. మండువేసవిని కూడా లెక్క చేయకుండా పలువరు వజ్రాల వేటలో నిమగ్నమవుతున్నారు. ఒక్క వజ్రం దొరికినా వారి లక్కు మారినట్లే. గతంలోనూ కర్నూలు జిల్లాలో వజ్రాలు లభించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి