iDreamPost

IND vs ENG: మూడో టెస్టుకు KS భరత్‌పై వేటు? కీపర్‌గా ఆ ఒక్కడికే ఛాన్స్‌!

  • Published Feb 07, 2024 | 12:09 PMUpdated Feb 07, 2024 | 12:09 PM

ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టుల కోసం భారత జట్టును ఎంపిక చేసే పనిలో సెలెక్టర్లు ఫుల్‌ బిజీగా ఉన్నారు. అయితే.. తొలి రెండు టెస్టులు ఆడిన భరత్‌పై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో..

ఇంగ్లండ్‌తో చివరి మూడు టెస్టుల కోసం భారత జట్టును ఎంపిక చేసే పనిలో సెలెక్టర్లు ఫుల్‌ బిజీగా ఉన్నారు. అయితే.. తొలి రెండు టెస్టులు ఆడిన భరత్‌పై వేటు వేసే అవకాశం కనిపిస్తోంది. అతని స్థానంలో..

  • Published Feb 07, 2024 | 12:09 PMUpdated Feb 07, 2024 | 12:09 PM
IND vs ENG: మూడో టెస్టుకు KS భరత్‌పై వేటు? కీపర్‌గా ఆ ఒక్కడికే ఛాన్స్‌!

ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా.. టీమిండియా ఈ నెల 15 నుంచి మూడో టెస్టు ఆడనుంది. ఇప్పటికే రెండు టెస్టులు ముగిసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌, విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్ట్‌లో ఇండియా విజయం సాధించాయి. మూడో టెస్ట్‌ రాజ్‌కోట్‌ వేదికగా జరగనుంది. అయితే.. చివరి మూడు టెస్టులకు జట్టును ఎంపిక చేయాల్సింది. నేడో రేపో భారత సెలెక్టర్లు జట్టును ప్రకటించనున్నారు. ఈ టీమ్‌లో తొలి రెండు టెస్టులు ఆడిన కొంతమంది ప్లేయర్లకు చోటు దక్కే అవకాశం కనిపించడం లేదని క్రికెట్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆ లిస్ట్‌లో ఎవరు ముందున్నారో ఇప్పుడు చూద్దాం..

తొలి రెండు టెస్టుల్లో దారునంగా విఫలమైన వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ కేఎస్‌ భరత్‌పై వేటు పడే అవకాశం ఉంది. హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో 41, 28 పరుగులు చేసిన భరత్‌.. రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 17, సెకండ్‌ ఇన్నింగ్స్‌లో 6 రన్స్‌ మాత్రమే చేశాడు. కీపర్‌గా పర్వాలేదనిపిస్తున్న భరత్‌.. బ్యాటర్‌గా మాత్రం దారుణంగా విఫలం అవుతున్నాడు. దీంతో.. చివరి మూడు టెస్టులకు భరత్‌ను పక్కనపెట్టే అవకావం ఉంది. భతర్‌ను పక్కనపెడితే.. మరి అతని స్థానంలో వికెట్‌ కీపర్‌గా ఎవరుంటారనే విషయంపై కూడా ఆసక్తి నెలకొంది. జట్టులో ఇప్పటికే కేఎల్‌ రాహుల్‌ ఉన్నా.. అతన్ని కేవలం స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గానే ఆడిస్తుండటంతో మూడో టెస్ట్‌కు రాహుల్‌ అందుబాటులో ఉన్నా.. అతన్ని వికెట్‌ కీపర్‌గా ఆడించే అవకాశం లేదు.

KS against Bharat for the third Test

అలాగే. యువ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ తిరిగి జట్టులోకి రావడంపై ఇంకా సస్పెన్స్‌ కొనసాగుతోంది. దేశవాళి క్రికెట్ ఆడి రావాలని ఇషాన్‌పై ఒక కండీషన్‌ ఉన్నట్లు సమాచారం. దీంతో.. అతన్ని చివరి మూడు టెస్టులకు ఎంపిక చేస్తారా? లేదా అన్నది అనుమానమే. ఇక టీమిండియాకు మిగిలిన ఏకైక ఆప్షన్‌ ధృవ్‌ జురెల్‌. ఈ యువ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌ను తొలి రెండు టెస్టులకు ఆల్రెడీ సెలెక్టర్లు ఎంపిక చేశారు. కానీ, బెంచ్‌కే పరిమితం అయ్యాడు. దీంతో.. మూడో టెస్టులో ఈ కుర్రాడికి అవకాశం ఇచ్చేందుకు కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌, కెప్టెన్‌ రోహిత్‌ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. సెలెక్టర్లు సైతం అతన్ని జట్టులో కొనసాగించే అవకాశం ఉంది. ఎలాగో కోహ్లీ, రాహుల్‌ లాంటి సీనియర్లు తిరిగొస్తే.. జట్టు బ్యాటింగ్‌లో బలం పెరుగుతుంది. అలాంటప్పుడు యువ ప్లేయర్‌కు అవకాశం ఇవ్వడంలో తప్పులేదని భావిస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి