iDreamPost

ధనుష్ తో సూపర్ స్టార్ సినిమా ?

ధనుష్ తో సూపర్ స్టార్ సినిమా ?

వయసు పెరిగే కొద్దీ స్పీడు పెంచుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం చేసిన అన్నాతే విడుదలకు రెడీ అవుతోంది. నవంబర్ రిలీజ్ అని ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి అభిమానులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారు. తమ హీరో కొత్త గెటప్ లో ఎలా ఉంటాడు, అజిత్ తో ఊర మాస్ బ్లాక్ బస్టర్స్ తీసిన సిరుతై శివ రజనిని ఏ లెవెల్ లో చూపిస్తాడనే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కీర్తి సురేష్, నయనతార, మీనా, ప్రకాష్ రాజ్ ఇలా పేరున్న పెద్ద క్యాస్టింగ్ ని ఎంచుకోవడంతో హైప్ కూడా అంకంతా పెరుగుతూ పోతోంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ డీల్స్ ఇంకా ఫైనల్ కాలేదు. అందుకే టైటిల్ కూడా పెండింగ్ లో ఉండిపోయింది

ఇప్పుడు నెక్స్ట్ రజనీకాంత్ ఎవరికి చేయబోతున్నాడనే సస్పెన్స్ మెల్లగా ఒక కొలిక్కి వస్తోంది. దుల్కర్ సల్మాన్ తో కనులు కనులు దోచాయంటే లాంటి థ్రిల్లింగ్ హిట్ ఇచ్చిన దేసింగ్ పెరియస్వామితో ఓ చిత్రం చేయొచ్చని టాక్ ఉంది కానీ ఇది ఎంతవరకు నిజమవుతుందో తెలియదు. అయితే అల్లుడు ధనుష్ డైరెక్షన్ లో రజని చేయడం కన్ఫర్మ్ అయ్యిందట. ధనుష్ గతంలో పవర్ పాండి అనే సినిమాను తీసి సూపర్ హిట్ కొట్టిన విషయం కోలీవుడ్ ని ఫాలో అయ్యేవాళ్ళకు తెలిసిందే. తెలుగులో మోహన్ బాబుతో రీమేక్ చేయాలనుకున్నారు కానీ ఏవో కారణాల వల్ల కుదరలేదు

ఒకవేళ పైన చెప్పిన ప్రాజెక్టు నిజమైతే మామను డైరెక్ట్ చేసిన అల్లుడిగా ధనుష్ కు ఒక ప్రత్యేకత వచ్చేస్తుంది. అయితే ఇతని కమిట్ మెంట్స్ చాలా బిజీగా ఉన్నాయి. ఆల్రెడీ తెలుగులో శేఖర్ కమ్ములతో ఓ ప్రాజెక్ట్ అఫీషియల్ గా అనౌన్స్ కాగా వెంకీ అట్లూరితో కూడా మరో సినిమా ఓకే చేయించేందుకు ఒక టాప్ ప్రొడక్షన్ సంస్థ రంగంలోకి దిగిందని టాక్. ఇవి కాకుండా ధనుష్ ఆల్రెడీ చేస్తున్నవి తమిళంలో రెండున్నాయి. జగమే తంతిరం ఓటిటిలో డిజాస్టర్ అయ్యాక కర్ణన్ విజయం తాలూకు ఆనందం కొంత తగ్గినా మరో హిట్టుతో కంబ్యాక్ కావొచ్చనే ధీమాతో ఉన్నాడు ధనుష్. మరి ఈ మామ అల్లుళ్ళ కాంబో ఎప్పుడు ప్రకటిస్తారో వేచి చూడాలి

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి