iDreamPost

బడ్జెట్ 90 కోట్లు – కలెక్షన్ 4 కోట్లు

బడ్జెట్ 90 కోట్లు – కలెక్షన్ 4 కోట్లు

కొన్ని నమ్మశక్యంగా ఉండవు. వారం క్రితం రిలీజైన ఒక హిందీ సినిమాకు మొన్న దేశవ్యాప్తంగా వచ్చిన మొత్తం కలెక్షన్ కేవలం 4 వేల 500 రూపాయలు అంటే షాక్ కలగక మానదు. కానీ ఇది నమ్మలేని వాస్తవం. కంగనా రౌనత్ నటించి ప్రధాన పాత్ర పోషించిన దాఖడ్ బాక్సాఫీస్ వద్ద అత్యంత చెత్త వసూళ్లు రాబట్టుకుంటోంది. బాలీవుడ్ లో కనివిని ఎరుగని డిజాస్టర్ గా నమోదయ్యేందుకు అన్నిరకాలుగా కష్టపడుతోంది. 90 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మాస్టర్ పీస్ ని ప్రేక్షకులు మొదటి రోజు ఫస్ట్ షోకే తిరస్కరించారు. క్రిటిక్స్ మరీ అన్యాయంగా వన్ రేటింగ్ ఇవ్వడం పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. డైరెక్ట్ ఓటిటికి నో అన్నందుకు మూల్యం చెల్లిస్తున్నారు.

20 టిక్కెట్లు, రూ.4,420 క‌లెక్ష‌న్

నిజానికి కంగనా రౌనత్ కు దీని మీద చాలా నమ్మకం ఉండేది. ప్రమోషన్లలో అదే విషయాన్ని చెప్పుకుంటూ వచ్చింది. కానీ మూవీ ఎంత బాగా లేకపోయినా ఏదో ఒక వర్గం కనీసం ఓసారైనా చూసేవాళ్ళు ఉంటారు. కానీ దాఖడ్ కు ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అలియా భట్ ని ఎప్పుడూ టార్గెట్ చేసిన కంగనా ఇప్పుడు తనే ట్రోలింగ్ కు గురవుతోంది. గంగూభాయ్ కటియావాడికి రెండో వారంలో వచ్చిన మొత్తం 5 కోట్లకు పైమాటే. కానీ ఇప్పుడీ దాఖడ్ కు వచ్చింది 5 వేల లోపే. దీన్ని బట్టే ఎవరి స్టార్ డం ఎంతనో అర్థమవుతోందని సోషల్ మీడియాలో నెటిజెన్లు గట్టిగా తలంటుతున్నారు. బహుశా ఇంత అవమానం గతంలో ఏ హీరోయిన్ కి జరగలేదని చెప్పాలి.

దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. పిచ్చి పిచ్చి సినిమాలు తీస్తే జనం మొహం మీద కొడుతున్నారు. అసలే థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఖరీదుగా మారుతున్న తరుణంలో కంటెంట్ లెస్ మూవీస్ కి ఇకపై ఇలాంటి సత్కారమే దక్కుతుంది. పైగా కెరీర్ కంటే ఎక్కువగా వివాదాల మీద దృష్టి పెట్టే కంగనాకు తానేం చేసినా చెల్లుతుందనే మనస్తత్వానికి ఈ ఫలితాలు స్పీడ్ బ్రేకర్స్ లాంటివి. భూల్ భూలయ్య 2 హిట్ కావడం ఈ ధాఖడ్ కు దెబ్బ పడేందుకు మరో కారణం అయ్యింది. అసలే సరైన బ్లాక్ బస్టర్ లేక కుదేలవుతున్న బాలీవుడ్ కి ఈ తరహా పరిణామాలు ఇబ్బంది కలిగించేవే. ఇప్పటిదాకా దాఖడ్ కు 8 రోజుల్లో వచ్చింది 4 కోట్ల 35 లక్షలు మాత్రమే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి