iDreamPost

తెలుగు డి‌ఎమ్‌ఎఫ్ వెబ్ సైట్‌ని ప్రారంభించిన మెగాస్టార్

తెలుగు కంటెంట్ క్రియేటర్స్ కోసం ఓ వేదిక ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

తెలుగు కంటెంట్ క్రియేటర్స్ కోసం ఓ వేదిక ప్రారంభమైంది. మెగాస్టార్ చిరంజీవి దీన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

తెలుగు డి‌ఎమ్‌ఎఫ్ వెబ్ సైట్‌ని ప్రారంభించిన మెగాస్టార్

ఇది ఒక మైలురాయి సంఘటన. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన తెలుగు కంటెంట్ క్రియేటర్స్ కోసం ఒక వెబ్ సైట్ ప్రారంభం కావడం, అదీ మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఓపెన్ కావడం….ఒక సంచలన పరిణామం. ఈ డిజిటల్ యుగంలో మెగాస్టార్ శ్రీకారం చుట్టిన ఈ వినూత్న పర్వం ఒక అద్భుతమైన ప్రక్రియకి ఆరంభం. తెలంగాణ రాష్ట్ర ఐ అండ్ పి ఆర్, రెవిన్యూ, హౌసింగ్ మినిష్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఫెడరేషన్ లోగో మరియు పోస్టర్ ని ఆవిష్కరించారు.

‘’ ఇటువంటి వేదికను ఏర్పాటు చేయడమే కార్యక్రమం ఈరోజున ఎంతో అవసరమైంది. తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ పేరుతో వెబ్ సైట్ రైటర్స్, ఇన్ స్టాగ్రామ్ ఇన్ఫ్లూయన్సర్స్, ట్విట్టర్ పర్సనాలిటీస్, మెమ్ క్రియేటర్స్ లాంటి వైవిధ్యమైన విభాగాలను ఒకే డయాస్ మీద ఏకం చేసే ఈ ప్రయత్నం నిజంగా ఒక వినూత్నమైన విశేషం. ఈ ప్రక్రియకి ఉన్న అపూర్వమైన విశాలమైన పరిధి ఎంతో అబినందనీయమైనది.’’ అని మెగాస్టార్ ప్రశంసించారు. వెబ్ సైట్ ని ప్రారంభించిన తర్వాత ఆయన మాట్లాడుతూ ఇటువంటి గొప్ప ప్రయత్నం తన చేతుల మీదుగా ప్రారంభం కావడం గర్వంగా ఉందని చెబుతూ, ఫెడరేషన్ ప్రయత్నం విజయవంతం కావాలన్న అశను వ్యక్తం చేసిన మెగాస్టార్ ఫెడరేషన్ పౌండింగ్ మెంబర్స్ అంకితభావాన్ని కూడా మెచ్చుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి