iDreamPost

Saraswathi Rajamani: నేతాజీ పక్కన ఉన్న ఈమె ఎవరో తెలుసా? డెవిల్ స్టోరీ ఈమెదే!

కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా చూసే ఉంటారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటించారు. అయితే ఈ పాత్రకు స్ఫూర్తి ఒక మహిళా గూఢచారి అని మీలో ఎంతమందికి తెలుసు. మొట్టమొదటి భారత మహిళా గూఢచారి అయిన సరస్వతి రాజమణినే డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ గూఢచారి పాత్రకు స్ఫూర్తి. మరి ఆమె ఎవరు? ఆమె కథేంటి?

కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా చూసే ఉంటారు. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా నటించారు. అయితే ఈ పాత్రకు స్ఫూర్తి ఒక మహిళా గూఢచారి అని మీలో ఎంతమందికి తెలుసు. మొట్టమొదటి భారత మహిళా గూఢచారి అయిన సరస్వతి రాజమణినే డెవిల్ సినిమాలో కళ్యాణ్ రామ్ గూఢచారి పాత్రకు స్ఫూర్తి. మరి ఆమె ఎవరు? ఆమె కథేంటి?

Saraswathi Rajamani: నేతాజీ పక్కన ఉన్న ఈమె ఎవరో తెలుసా? డెవిల్ స్టోరీ ఈమెదే!

కళ్యాణ్ రామ్ నటించిన డెవిల్ సినిమా చూసే ఉంటారు. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ గా పని చేస్తుంటాడు. నేతాజీని పట్టుకోవాలని బ్రిటిష్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటుంది. ఆ సమయంలో బోస్ ఇండియా వస్తున్నాడని తెలుస్తుంది. ఒక సీక్రెట్ కోడ్ ద్వారా తన మనుషులకు బోస్ ఆ విషయాన్ని తెలియజేస్తాడు. ఆ సీక్రెట్ కోడ్ లో బోస్ ఎక్కడ ల్యాండ్ అవుతున్నాడు అనేది తెలుస్తుంది. ఆ కోడ్ ని డీకోడ్ చేయడానికి బ్రిటిష్ గవర్నమెంట్ డెవిల్ ని నియమిస్తుంది. అయితే డెవిల్ బ్రిటిష్ వారి కోసం పని చేసినట్టు ఉంటుంది కానీ అతను పని చేసేది నేతాజీ సుభాష్ చంద్రబోస్ కోసం. ఈ విషయం క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఆ డెవిల్ పేరే త్రివర్ణ. త్రివర్ణ అంటే నేతాజీ రైట్ హ్యాండ్. ఈ త్రివర్ణ క్యారెక్టర్ లో కళ్యాణ్ రామ్ నటించారు. అయితే ఈ పాత్రకి రిఫరెన్స్ రియల్ లైఫ్ డెవిల్ అని మీలో ఎంతమందికి తెలుసు. ఆమె కూడా బ్రిటిష్ గవర్నమెంట్ లో గూఢచారిగా పని చేశారు. ఆమె పేరు సరస్వతి రాజమణి.

ఈమె 1927 జనవరి 11న ప్రస్తుతం మయన్మార్ గా పిలవబడుతున్న బర్మాలోని రంగూన్ లో జన్మించారు. ఈమె ఐఎన్ఏలో మిలిటరీ ఇంటిలిజెన్స్ విభాగంలో పని చేశారు. ఐఎన్ఏలో పని చేసిన మొదటి స్త్రీ సరస్వతి రాజమణి కావడం విశేషం. అంతేకాదు భారత మొట్టమొదటి గూఢచారి కూడా ఈమెనే కావడం విశేషం. ఒకసారి నేతాజీ బర్మా వెళ్ళినప్పుడు ఈమె ఆయనను కలిసి ఐఎన్ఏలో చేరారు. నిజానికి ఆమె పేరు రాజమణి. అయితే ఆమె తెలివితేటలకు నేతాజీ ఆమె పేరు ముందు సరస్వతి పేరు చేర్చారు. దీంతో ఆమె సరస్వతి రాజమణి అయ్యారు. నేతాజీ సరస్వతి రాజమణితో సహా ఆమె స్నేహితులను కూడా ఐఎన్ఏలో గూఢచారులుగా నియమించారు. వీరంతా మగాళ్లుగా మారువేషంలో బ్రిటిష్ గవర్నమెంట్ లో పని చేసేవారు. అక్కడ భారతదేశానికి, నేతాజీకి వ్యతిరేకంగా ఉన్న సమాచారాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీకి చేరవేసేవారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ గవర్నమెంట్ సీక్రెట్స్ తెలుసుకోవడానికి.. రాజమణి కోల్కతాలోని బ్రిటిష్ మిలిటరీ స్థావరంలో కార్మికుడిగా మారువేషంలో చేరారు.

Devile kalyan ram character real life character with subhash chandra bose

అయితే 1943లో నేతాజీ ఇండియా వస్తున్నారని తెలుసుకున్న బ్రిటిష్ ప్రభుత్వం ఆయన హత్యకు ప్రణాళికలు రచించింది. అందుకోసం బ్రిటిష్ ప్రభుత్వం ఐఎన్ఏలో ఒక గూఢచారిని నియమించింది. ఆయన ఎక్కడికి వస్తున్నారో తెలుసుకుని చంపాలనేది బ్రిటిష్ వారి స్కెచ్. అయితే ఈ స్కెచ్ ని రాజమణి ఎంతో తెలివిగా తెలుసుకుని బోస్ ఇండియా రాకుండా ఆపారు. కార్మికుడి వేషంలో, నర్తకి వేషంలో బ్రిటిష్ సైన్యంలో చేరి వారి రహస్యాలను తెలుసుకుని ఐఎన్ఏకి చేరవేసి ఎనలేని సేవలను అందించారు. ఒకసారి బ్రిటిష్ వారి నుంచి తప్పించుకుంటున్న సమయంలో ఆమె కాలి మీద కాల్పులు జరిపారు. దీంతో ఆమె నెత్తుటి గాయంతోనే తప్పించుకుని బయటపడ్డారు. ఆ తర్వాత ఆమె బర్మా నుంచి భారత్ కు వచ్చారు. 2005లో ఓ ఇంటర్వ్యూలో ఆమె నేతాజీ గురించి మాట్లాడుతూ.. ఆయన దేవుడు లాంటి వారని.. రేపు ఏం జరుగుతుందో ముందుగానే చూడగలిగేవారని ఆమె అన్నారు. నేతాజీ మారువేషాల్లో తిరిగేవారని.. స్వామి వివేకానంద ఆదర్శాలను ఆయన బలంగా నమ్మేవారని రాజమణి వెల్లడించారు.

1957లో ఆమె కుటుంబం తమిళనాడుకు వచ్చింది. 1971 దాకా ఆమెకు అక్కడి ప్రభుత్వం స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ ఇవ్వలేదు. 2005 వరకూ ఆమె చెన్నైలోని చిన్న అపార్ట్మెంట్ లో జీవితం గడిపిన ఆమెను అప్పటి సీఎం జయలలిత ఆదుకున్నారు. ప్రభుత్వ భవనాన్ని ఎటువంటి అద్దె లేకుండా వాడుకోవడానికి కేటాయించారు. అంతేకాకుండా స్వాతంత్య్ర సమరయోధుల పింఛన్ కూడా ఇప్పించారు. అయితే 2004లో సునామీ బాధితులకు తన పింఛన్ ని విరాళంగా ఇచ్చి మంచి మనసు చాటుకున్నారు సరస్వతి రాజమణి. ఈమె 2018 జనవరి 13న చెన్నైలోని పీటర్స్ కాలనీలో తుదిశ్వాస విడిచారు. ఇలాంటి ఆమె పాత్రను డెవిల్ సినిమాలో రిఫరెన్స్ గా తీసుకున్నారు. కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమా గమనిస్తే.. దర్శకుడు త్రివర్ణ అనే పాత్రను ఒక మహిళ అనే విధంగా చివరి వరకూ ఆడియన్స్ నమ్మిస్తూ వచ్చారు. అయితే చివరిలో త్రివర్ణ అంటే మగాడు అని తెలుస్తుంది. ఈ క్యారెక్టర్ కి రిఫరెన్స్ సరస్వతి రాజమణినే అని స్పష్టంగా తెలుస్తోంది. ఈమె కూడా మారువేషంలో మగాడిగా బ్రిటిష్ వారి దగ్గర పని చేసేవారు. మరి బ్రిటిష్ వారి దగ్గర పని చేసిన రియల్ డెవిల్ అలియాస్ రియల్ త్రివర్ణ సరస్వతి రాజమణిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.  

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి