iDreamPost

‘దేవర’ షూటింగ్​లో తిరిగి జాయిన్ అయిన ఎన్టీఆర్!

  • Published Feb 27, 2024 | 4:33 PMUpdated Feb 27, 2024 | 4:33 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్​తో పాటు మూవీ గోయర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘దేవర’. ఈ మూవీతో తారక్ మరో బ్లాక్​బస్టర్ కొట్టాలని అంతా కోరుకుంటున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్​తో పాటు మూవీ గోయర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘దేవర’. ఈ మూవీతో తారక్ మరో బ్లాక్​బస్టర్ కొట్టాలని అంతా కోరుకుంటున్నారు.

  • Published Feb 27, 2024 | 4:33 PMUpdated Feb 27, 2024 | 4:33 PM
‘దేవర’ షూటింగ్​లో తిరిగి జాయిన్ అయిన ఎన్టీఆర్!

2016లో విడుదలైన ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి కొరటాల శివ కాంబినేషన్​లో ‘దేవర’ సినిమా మొదలుపెట్టారు. ఈ మూవీపై తారక్ అభిమానుల్లోనే కాక ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ కొన్ని వ్యక్తిగత పనుల నిమిత్తం సిటీకి దూరంగా ఉంటున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘దేవర’ షూటింగ్​లో ఆయన తిరిగి పాల్గొంటున్నారని తెలుస్తోంది.

ప్రస్తుతం ‘దేవర’ ఫిల్మ్ షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతున్నట్లు సమాచారం. మరి కొన్ని రోజులు రాత్రి పూట షూటింగ్ జరగనుంది. ఎన్టీఆర్ కూడా సెట్స్ లో జాయిన్ అయినట్లు టాక్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ మెయిన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. కాగా, ఈ చిత్రం ఆమెకు తెలుగు సినిమా పరిశ్రమలో తొలి సినిమా కావడం విశేషం. అక్టోబర్ 10, 2024న ప్రేక్షకుల ముందుకు రానుంది ‘దేవర’. నిజానికి ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అయితే షూటింగ్​లో జరిగిన ఆలస్యం, వీఎఫ్ఎక్స్ వర్క్​లో పర్ఫెక్షన్ కోసం ఈ మూవీని వాయిదా వేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.

‘దేవర’ పోస్ట్​పోన్ న్యూస్ విని ఎన్టీఆర్ అభిమానులు నిరాశ పడ్డా.. ఎప్పుడు వచ్చినా తమ అభిమాన హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొడతారని నమ్మకంగా ఉన్నారు. కాగా, ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ పని చేస్తున్నారు. అనుకున్న సమయానికి అనిరుధ్ ట్యూన్స్ ఇవ్వలేకపోవడం కూడా సినిమా విడుదలలో ఆలస్యానికి కారణం అయిందని కొన్ని వార్తలు వచ్చాయి. ఈ పుకార్లు అన్నీ ఆగాలంటే తొందరలోనే ‘దేవర’ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేయాలని తారక్ అభిమానులు కోరుకుంటున్నారు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘దేవర’ చిత్ర యూనిట్ అభిమానుల కోరిక తీరుస్తారా? లేదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగక తప్పదు. మరి.. ఎన్టీఆర్ ‘దేవర’ రిలీజ్ కోసం మీరెంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మహేశ్ కోసం జేమ్స్ కామెరూన్! జక్కన్న ప్లాన్ అదిరిందిగా..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి