iDreamPost

లాక్ డౌన్ నష్టం.. ఆటో డ్రైవర్లకు 5 వేల సహాయం..

లాక్ డౌన్ నష్టం.. ఆటో డ్రైవర్లకు 5 వేల సహాయం..

కరోనా వైరస్ ను కట్టడి చేసే నేపథ్యంలో దేశంలో గత మూడు వారాలుగా లాక్ డౌన్ అమల్లో ఉంది. నిత్యవసర వస్తువులు, అత్యవసర సేవలు మినహా అన్ని కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. రోజువారీగా పని చేసుకునే వారి బతుకులు చ్ఛిన్నాభిన్నం అయిపోయాయి. కేంద్ర ప్రభుత్వం, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు జీవులు ఆదుకునేందుకు వీలైనంత మేర సహాయ కార్యక్రమాలు చేపడుతున్నాయి.

లాక్ డౌన్ కారణంగా అన్ని రంగాలతో పాటు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. రోజు ఆటో తోలుకొని జీవించే కుటుంబాలు ఆసరాను కోల్పోయాయి. ఈ నేపథ్యంలో ఆటోడ్రైవర్లకు ఐదు వేల రూపాయల చొప్పున ఇవ్వాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేజ్రీవాల్ విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు.

గత నెల 24వ తేదీ అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ అమలవుతోంది. ముందుగా నిర్ణయించిన మేరకు రేపటి తో ముగియాల్సి ఉండగా.. దేశం లో కరోనా వైరస్ కేసులు సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది. ప్రతి రోజు రెట్టింపు సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ ను మరో రెండు వారాలు పొడిగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఈ నెల 30 వరకు కొనసాగుతుందని సంకేతాలు వెలువడుతున్నాయి. అంటే.. 5 వారాల పాటు లాక్ డౌన్ కొనసాగుతుంది. నెల రోజులకు పైగా లాక్ డౌన్ కొనసాగనుండడంతో.. కేజ్రీవాల్ సర్కార్ ఆటోవాలలకు ఆర్ధిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఇప్పటికే నిరాశ్రయులకు షెల్టర్ లు ఏర్పాటు చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి