iDreamPost

ప్లే స్కూల్ ఫీజు.. రూ.4 లక్షలు! సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఓ తండ్రి పోస్ట్!

  • Published Apr 15, 2024 | 7:46 PMUpdated Apr 15, 2024 | 7:46 PM

ప్లే స్కూల్ ఫీజు 4.3 లక్షల రూపాయలు అనే పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంతకు ఎక్కడ ఈ ఫీజుల దోపిడి అంటే..

ప్లే స్కూల్ ఫీజు 4.3 లక్షల రూపాయలు అనే పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంతకు ఎక్కడ ఈ ఫీజుల దోపిడి అంటే..

  • Published Apr 15, 2024 | 7:46 PMUpdated Apr 15, 2024 | 7:46 PM
ప్లే స్కూల్ ఫీజు.. రూ.4 లక్షలు! సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఓ తండ్రి పోస్ట్!

తిండి, ఇల్లు, బట్టలు మనిషికి ఎలా ప్రాథమిక అవసరాలుగా మారాయో.. విద్య, వైద్యం కూడా వాటి జాబితాలోకి చేరాయి. ఇక నేటి కాలంలో నాణ్యమైన విద్య, వైద్యం అందడం అనేది చాలా ఖరీదుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. మెరుగైన చదువు, వైద్యం కోసం ప్రైవేటు సంస్థలకు వెళ్తే అప్పులు పాలు కావాల్సిందే. ఇక ప్రైవేటు విద్యా సంస్థల్లో దోపిడి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కొన్ని రోజుల క్రితమే మూడో తరగతికి 3 లక్షల రూపాయల ఫీజు అనే వార్త చదివి ఆశ్చర్యపోయాం. ఇప్పుడు అంతకు మించిన వార్త వెలుగులోకి వచ్చింది. ప్లే స్కూల్ ఫీజు ఏకంగా 4 లక్షల రూపాయలు అంట. ఇంత భారీ ఫీజు చూసి ఓ తండ్రి కన్నీటితో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆ వివరాలు..

మరి కొన్ని రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇక ఈ ఏడాది స్కూల్ ఫీజులను 30-40 శాతం పెంచే దిశగా కార్పొరేట్‌ స్కూళ్లు రెడీ అయినట్లు తెలుస్తోంది. పిల్లలకు మంచి విద్య అందించాలంటే.. తల్లిదండ్రులు అప్పులపాలై.. ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇక తాజాగా ఓ తండ్రి తన కుమారుడి ప్లే స్కూల్ కోసం చెల్లిస్తున్న ఫీజు వివరాలు షేర్ చేయడంతో.. ఇది నెట్టింట వైరల్ గా మారింది. కేవలం ప్లే స్కూల్ ఫీజే 4 లక్షల రూపాయలు అంట. ఈ పోస్ట్ చూసిన నెటిజనులు షాక్ అవుతున్నారు.

ఢిల్లీకి చెందిన ఆకాష్‌ కుమార్‌ చార్టర్డ్ అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన తన కుమారుడి ప్లేస్కూల్ ఫీజు గురించి ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. తన కుమారుడి ప్లేస్కూల్‌ ఫీజు అక్షరాల రూ.4.3లక్షలు అంట. తన చదువు మొత్తం పూర్తవ్వడానికి ఎంత ఫీజు చెల్లించాడో.. అంతకంటే ఎక్కువగా తన కొడుకు ప్లేస్కూల్‌ ఫీజు చెల‍్లించాల్సి వస్తుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ ప్లే స్కూల్లో తన కొడుకు కనీసం ఆడటం నేర్చుకుంటాడని ఆశిస్తున్నాను అంటూ ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఫీజు రిసిప్ట్‌ను సైతం షేర్‌ చేశాడు.

ఫీజు వివరాలివే :

  • రిజిస్ట్రేషన్‌ ఫీ (వన్‌ టైమ్‌ నాన్‌-రిఫండబుల్‌) – రూ.10వేలు
  • ఏడాది ఫీజు – రూ.25వేలు
  • టర్మ్‌-1 (ఏప్రిల్‌ – జూన్‌ 2024) – రూ.98,750
  • టర్మ్‌-2 (జులై- సెప్టెంబర్‌ 2024) – రూ.98,750
  • టర్మ్‌-3 ( అక్టోబర్‌ -డిసెంబర్‌ 2024) – రూ.98,750
  • టర్మ్‌ -4 ( జనవరి – మార్చి 2025) – రూ.98,750
  • టోటల్‌ ఫీజు – రూ.4,40,000

ఆకాశ్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. మిలియన్ల మంది దీన్ని చూడటమే కాక.. తమ అనుభవాలను పంచుకుంటున్నారు. తాము కూడా ఇదే సమస్యతో బాధపడుతున్నామని.. ప్రభుత్వం దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి