iDreamPost

మందుబాబులకు షాక్ – 70 శాతం మద్యం ధరలు పెంచిన ఢిల్లీ ప్రభుత్వం..

మందుబాబులకు షాక్ – 70 శాతం మద్యం ధరలు పెంచిన ఢిల్లీ ప్రభుత్వం..

దాదాపు 40 రోజుల సుదీర్ఘ విరామం తర్వాత లాక్‌డౌన్‌ నిబంధనలను సడలించి మద్యం దుకాణాలు తెరవడానికి కేంద్రప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. దీంతో మద్యం కోసం 40 రోజులుగా ఎదురుచూస్తున్న మందుబాబులు దుకాణాల వద్ద బారులు తీరారు.మందుబాబులు మద్యం దుకాణాల వద్దకు పెద్ద ఎత్తున చేరుకోవడంతో తీవ్ర రద్దీ ఏర్పడింది.

స్పెషల్ కరోనా ఫీజ్ కింద మందుబాబులకు టాక్స్ వేసిన ఢిల్లీ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు తుంగలో తొక్కి మందుబాబులు భౌతిక దూరం పాటించకుండా మద్యం దుకాణాల వద్ద గుమిగూడటంతో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమాంతంగా మద్యం ధరలు 70 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. మద్యం ధరలు భారీగా పెంచడంతో దుకాణాల వద్ద రద్దీ తగ్గే అవకాశం ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు

సోమవారం రాత్రి ఢిల్లీ ప్ర‌భుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో రిటైల్ లైసెన్సుల కింద విక్రయించే అన్ని ర‌కాల మ‌ద్యాల‌కు సంబంధించి, గరిష్ట రిటైల్ ధర (ఎంఆర్‌పి)పై 70 శాతం పన్ను విధించినట్లు తెలిపింది.పెంచిన మద్యం ధరలను “స్పెషల్ కరోనా ఫీజ్” కింద మందుబాబులు దగ్గరనుండి ఢిల్లీ ప్రభుత్వం వసూలు చేయనుంది.. పెరిగిన మద్యం ధరలు మంగళవారం నుండి అనగా నేటినుండి అమల్లోకి వస్తాయ్..

దీంతో దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ధరలు 70 శాతం పెరగడంతో “మందు బాబులు” వాపోతున్నారు..

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి