iDreamPost

ఖైదీకి లా ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు అనుమతి

విద్య ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. గతంలోనూ చాలామంది ఖైదీలు జైలులో ఉండే విద్యను అభ్యసించేందుకు కోర్టు అనుమతి కోరిన దాఖలాలు ఉన్నాయి.

విద్య ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. గతంలోనూ చాలామంది ఖైదీలు జైలులో ఉండే విద్యను అభ్యసించేందుకు కోర్టు అనుమతి కోరిన దాఖలాలు ఉన్నాయి.

ఖైదీకి లా ఎంట్రన్స్ టెస్ట్ రాసేందుకు అనుమతి

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (NLU) ఈ ఏడాది జూన్ 26వ తేదీన ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ టెస్ట్ (AILET) పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షకు హాజరయ్యేందుకు జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీకి ఢిల్లీ కోర్టు అనుమతి మంజూరు చేసింది. నిందితుడి తరఫు న్యాయవాది.. నిందితుడు BA, LLB(Hons) చదివేందుకు AILET పరీక్షకు దరఖాస్తు చేసుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జి చంద్ర శేఖర్ పిటిషన్ ను పరిశీలించి.. విద్య ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని పేర్కొన్నారు. గతంలోనూ చాలామంది ఖైదీలు జైలులో ఉండే విద్యను అభ్యసించేందుకు కోర్టు అనుమతి కోరిన దాఖలాలు ఉన్నాయి. ఇది న్యాయానికి- విద్యకు సంబంధించిన అంశం కావడంతో సదరు నిందితుడు AILET పరీక్షకు హాజరయ్యేందుకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.

AILET పరీక్షకు దరఖాస్తు చేసుకున్న నిందితుడు శశాంక్ జాడాన్ ప్రస్తుతం దాసనా జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. పరీక్ష సమయంలో అతడి పూర్తి బాధ్యతను జైలు సూపరింటెండెంట్ కు అప్పగించింది కోర్టు. పరీక్షకు సమయానికి హాజరయ్యేలా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని కోర్టు ఆదేశించింది. అలాగే అడ్మిట్ కార్డుపై సూచించిన పత్రాలను తీసుకెళ్లేందుకు శశాంక్ ను అనుమతించాలని తెలిపారు. జూన్ 28వ తేదీన అందుకు సంబంధించిన సమ్మతి నివేదికను సూపరింటెండెంట్ కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఈ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ, ఈ వ్యవహారంపై రిప్లై ఇచ్చేందుకు సమయం కావాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోరారు. అయితే, ఈ విషయంలో సీబీఐ ఇంతకుముందు నోటీసుకు ఎలాంటి సమాధానం దాఖలు చేయలేదని, సమాధానం దాఖలు చేయడానికి మరింత సమయం ఇవ్వడంలో అర్థం లేదని కోర్టు పేర్కొంది. ఏదేమైనా ఖైదీకి లా సెట్ రాసేందుకు కోర్టు అనుమతివ్వడం చర్చనీయాంశమైంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి