iDreamPost

డీప్‌ ఫేక్‌ బాధితుల లిస్ట్‌లో చేరిన సచిన్‌ టెండూల్కర్‌!

ఇటీవల డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలతో పలువురు నటీనటులను ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సచిన్‌పైనే ఫేక్ వీడియో వదిలారు. ఈ క్రమంలో తాజాగా క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ డీఫ్ ఫేక్ వీడియో బారిన పడ్డారు.

ఇటీవల డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలతో పలువురు నటీనటులను ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సచిన్‌పైనే ఫేక్ వీడియో వదిలారు. ఈ క్రమంలో తాజాగా క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ డీఫ్ ఫేక్ వీడియో బారిన పడ్డారు.

డీప్‌ ఫేక్‌ బాధితుల లిస్ట్‌లో చేరిన సచిన్‌ టెండూల్కర్‌!

టెక్నాలజీలో వచ్చిన విప్లవాత్మక మార్పులు మానవ జీవన శైలిని మార్చేశాయి. అందుబాటులో ఉన్న టెక్నాలజీతో ఉపయోగం ఎంతుందో నష్టం కూడా అంతే ఉందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో కొందరు ఆకతాయిలు మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల డీప్ ఫేక్ వీడియోలు, ఫొటోలతో పలువురు నటీనటులను ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సచిన్‌పైనే ఫేక్ వీడియో వదిలారు. ఈ క్రమంలో తాజాగా క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ డీఫ్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. ఈ ఘటనపై లెజెండరీ క్రికెటర్ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.

ఇప్పటి వరకు డీప్ ఫేక్ వీడియోలతో సినిమా సెలబ్రిటీలను టెన్షన్ పెట్టిన కేటుగాళ్లు ఇప్పుడు క్రీడాకారులపై ఫేక్ వీడియోలతో విరుచుకుపడుతున్నారు. దిగ్గజ క్రికెటర్ సచిన్ పై వచ్చిన డీప్ ఫేక్ వీడియో తీవ్ర కలకం రేపుతోంది. ఓ ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీని ప్రమోట్ చేస్తోన్నట్లుగా ఉన్న ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో నెట్టింటా హల్ చల్ చేస్తోంది. ఆన్‌లైన్ గేమ్‌ను ఆడటం ద్వారా తన కూతురు రోజూ వేల రూపాయలను సంపాదిస్తోందంటూ సచిన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా ఆ డీప్ ఫేక్ వీడియోలో ఉంది. దీనిపై సచిన్ స్పందించారు. ఈ వీడియోలో ఉన్నది తాను కాదని, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దీన్ని సృష్టించారని వెల్లడించారు. ఈ వీడియో చూసి బాధపడ్డానని, అందులో చేసిన వ్యాఖ్యలు కలచి వేశాయనీ వ్యాఖ్యానించారు. సాంకేతికతను దుర్వినియోగం చేయడం పూర్తిగా తప్పంటూ ఆవేధన వ్యక్తం చేశారు.

మీరు అలాంటి వీడియోలు లేదా యాప్‌లు లేదా ప్రకటనలను చూసినట్లయితే, వాటిని వెంటనే నివేదించాలని అందరిని అభ్యర్థించారు. ఇలాంటి డీప్ ఫేక వీడియోల విషయంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్, యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సచిన్ టెండుల్కర్ సూచించారు. డీప్ ఫేక్ వీడియోలపై వచ్చిన ఫిర్యాదులపై వీలైనంత త్వరగా సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుడు సమాచారం మరియు డీప్‌ఫేక్‌ల వ్యాప్తిని ఆపడానికి త్వరిత చర్య చాలా కీలకం అన్నారు. డీప్ ఫేక్ వీడియో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు సచిన్ టెండుల్కర్. మరి సచిన్ టెండూల్కర్ పై డీప్ ఫేక్ వీడియో చేసిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి