iDreamPost

David Warner, Dean Elgar: తెలుగు సామెతను నిజం చేస్తున్న డేవిడ్‌ వార్నర్‌, డీన్‌ ఎల్గర్‌! ఇప్పుడిదే ట్రెండ్‌

  • Published Dec 28, 2023 | 12:19 PMUpdated Dec 28, 2023 | 12:19 PM

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా సీనియర్‌ బ్యాటర్‌ డీన్‌ ఎల్గర్‌ సెంచరీతో కదంతొక్కాడు. అలాగే పాకిస్థాన్‌-ఆసీస్‌ తొలి టెస్ట్‌లో వార్నర్‌ సెంచరీ సాధించాడు. అయితే.. ఈ రెండు సెంచరీల్లో ఒక కామన్‌ పాయింట్‌ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా సీనియర్‌ బ్యాటర్‌ డీన్‌ ఎల్గర్‌ సెంచరీతో కదంతొక్కాడు. అలాగే పాకిస్థాన్‌-ఆసీస్‌ తొలి టెస్ట్‌లో వార్నర్‌ సెంచరీ సాధించాడు. అయితే.. ఈ రెండు సెంచరీల్లో ఒక కామన్‌ పాయింట్‌ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 28, 2023 | 12:19 PMUpdated Dec 28, 2023 | 12:19 PM
David Warner, Dean Elgar: తెలుగు సామెతను నిజం చేస్తున్న డేవిడ్‌ వార్నర్‌, డీన్‌ ఎల్గర్‌! ఇప్పుడిదే ట్రెండ్‌

ప్రస్తుతం రెండు బాక్సింగ్‌డే టెస్టులు జరుగుతున్నాయి. ఒకటి సెంచూరియన్‌ వేదికగా ఇండియా-సౌతాఫ్రికా మధ్య, ఇంకొకటి మెలబోర్న్‌లో ఆస్ట్రేలియా-పాకిస్థాన్‌ మధ్య జరుగుతున్నాయి. డిసెంబర్‌ 26న ప్రారంభం అయ్యే టెస్ట్‌ మ్యాచ్‌లను బాక్సిండే టెస్ట్‌ అంటారన్న విషయం తెలిసిందే. ఆ విషయం పక్కనపెడితే.. ఈ రెండు బాక్సింగ్‌ డే టెస్టుల్లో ఒక విషయం కామన్‌గా జరుగుతోంది. అదేంటంటే.. త్వరలో టెస్ట్‌ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న ఇద్దరు స్టార్‌ ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తెలుగులో ఉన్న ఒక సామెత.. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువను నిజం చేస్తూ.. ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌, సౌతాఫ్రికా సీనియర్‌ ప్రో డీన్‌ ఎల్గర్‌ సెంచరీలతో చెలరేగారు.

నిజానికి వీళ్లిద్దరూ.. ఈ టెస్ట్‌ సిరీస్‌ల తర్వాత రిటైర్‌ అవుతున్నట్లు ముందుగానే ప్రకటించారు. దీంతో.. వీరి చివరి టెస్ట్‌ సిరీస్‌పై అందరూ ఆసక్తి చూపించారు. వాళ్లు ఎలా ఆడతారని కూడా అంతా ఆసక్తిగా ఎదురుచూశాడు. అయితే.. కెరీర్‌ పీక్స్‌లో ఉన్నట్లు ఇద్దరూ కూడా భారీ సెంచరీలతో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో వార్నర్‌ వీరవిహారం చేశాడు. పాక్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను చీల్చిచెండాడుతూ.. 211 బంతుల్లో 16 ఫోర్లు, 4 సిక్సులతో 164 పరుగులు చేసి దుమ్మురేపాడు. అలాగే ఇండియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఎల్గర్‌ సైతం అలానే రెచ్చిపోయి ఆడుతున్నాడు. టీమిండియా స్పీడ్‌స్టర్స్‌ జస్ప్రీత్‌ బుమ్రా, మొహమ్మద్‌ సిరాజ్‌ తమ పేస్‌తో నిప్పులు చెరిగినా.. తన అనుభవంతో వారిని చాలా జాగ్రత్తగా ఆడిన ఎల్గర్‌.. ఇతర బౌలర్లపై తన ప్రతాపం చూపించాడు. 211 బంతుల్లో 23 ఫోర్లతో 140 పరుగులు చేసి ప్రస్తుతం నాటౌట్‌గా ఉన్నాడు.

ఇలా ఇద్దరు సీనియర్‌ ఆటగాళ్లు రిటైర్‌మెంట్‌ ముందు ఇలా కొదమసింహాల్లా చెలరేగడం చూసిన తెలుగు క్రికెట్‌ అభిమానులు ఆరిపోయే దీపాలకు వెలుగు ఎక్కువ అంటూ సరదాగా సామెతలు వల్లె వేసుకుంటున్నారు. వీరిద్దరితో పాటు.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో సౌతాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ సైతం అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. అతను కూడా తన కెరీర్‌లో చివరి వన్డే వరల్డ్‌కప్‌ ఆడేశాడు. వరల్డ్‌ కప్‌ ముందే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించిన డికాక్‌.. వరల్డ్‌ కప్‌లో మాత్రం సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. ఇలా రిటైర్మెంట్‌ ప్రకటించి.. చెలరేగి ఆడటం ఈ రోజుల్లో ట్రెండ్‌గా మారిందంటూ.. క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి