iDreamPost

David Warner: 13 ఏళ్ల కెరీర్.. ఎన్నో ఘనతలు! ఆ ఒక్క మచ్చ తప్పితే.. మేలిమి వజ్రమే డేవిడ్ వార్నర్

13 ఏళ్ల కెరీర్.. ఎన్నో ఘనతలు! ఆ ఒక్క మచ్చ తప్పితే.. మేలిమి వజ్రమే డేవిడ్ వార్నర్. పాకిస్తాన్ తో జరిగిన మూడో టెస్ట్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ నుంచి వార్నర్ సెలవు తీసుకున్నాడు. ఈ సందర్భంగా అతడి కెరీర్ ను ఓసారి పరిశీలిద్దాం.

13 ఏళ్ల కెరీర్.. ఎన్నో ఘనతలు! ఆ ఒక్క మచ్చ తప్పితే.. మేలిమి వజ్రమే డేవిడ్ వార్నర్. పాకిస్తాన్ తో జరిగిన మూడో టెస్ట్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ నుంచి వార్నర్ సెలవు తీసుకున్నాడు. ఈ సందర్భంగా అతడి కెరీర్ ను ఓసారి పరిశీలిద్దాం.

David Warner: 13 ఏళ్ల కెరీర్.. ఎన్నో ఘనతలు! ఆ ఒక్క మచ్చ తప్పితే.. మేలిమి వజ్రమే డేవిడ్ వార్నర్

ప్రపంచ క్రికెట్ లో ఒక శిఖరం తన ఆటకు వీడ్కోలు పలికింది. తన 13 సంవత్సరాల కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు, మరెన్నో కష్టనష్టాలు. ఇవన్నీ చాలవన్నట్లు తన కెరీర్ లోనే ఓ మాయని మచ్చ. వీటన్నింటిని తట్టుకు ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఆ యోధుడిపేరే డేవిడ్ వార్నర్. ప్రపంచ క్రికెట్ లోకి అందరిలాగానే సాదాగా అడుగుపెట్టి.. తన ఆటతీరుతో విధ్వంసకర ఓపెనర్ గా అందరి మన్ననలు పొందాడు. వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత మళ్లీ అలాంటి బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించేవాడు వార్నర్. అలాంటి వార్నర్ టెస్ట్ క్రికెట్ కు వీడ్కోలు పలకడంతో.. ఆస్ట్రేలియా టెస్ట్ క్రికెట్ లో ఓ శకం ముగిసిందనే చెప్పాలి. పాకిస్తాన్ తో జరిగిన మూడో టెస్ట్ తర్వాత రెడ్ బాల్ క్రికెట్ నుంచి వార్నర్ సెలవు తీసుకున్నాడు. ఈ సందర్భంగా అతడి కెరీర్ ను ఓసారి పరిశీలిద్దాం.

డేవిడ్ వార్నర్.. 1986 అక్టోబర్ 27న ఆస్ట్రేలియాలోని తూర్పుసిడ్నీలోని పాడింగ్టన్ లో జన్మించాడు. చిన్న తనం నుంచే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు వార్నర్. అయితే 13 సంవత్సరాలు ఉన్నప్పుడు వార్నర్ ను కుడిచేతి బ్యాటర్ గా మారమని తన కోచ్ సలహాల ఇచ్చాడు. కానీ తన తల్లి మాత్రం అతడిని ఎడమ చేతి వాటంతోనే బ్యాటింగ్ కు చేయమని ప్రోత్సహించింది. ఆసీస్ డొమెస్టిక్ క్రికెట్ లో వార్నర్ న్యూ సౌత్ వేల్స్, సిడ్నీ థండర్స్ తరఫున ఆడాడు. అద్బుత ఆటతీరు కనబరుస్తూ.. తక్కువ కాలంలోనే జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు.

ఈ క్రమంలోనే 2009లో వన్డేల్లోకి అడుగుపెట్టిన వార్నర్.. సంప్రదాయ క్రికెట్ అయిన టెస్టుల్లోకి మాత్రం 2011లో ఎంట్రీ ఇచ్చాడు. న్యూజిలాండ్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన ఈ స్టార్ ఓపెనర్ అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకోలేదు. తనదైన బ్యాటింగ్ తో ఇటు వన్డేల్లో, అటు టెస్టుల్లో, టీ20ల్లో దుమ్మురేపే ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాడు. క్రీజ్ లోకి అడుగుపెట్టగానే బౌండరీలు బాదుతూ.. బౌలర్లపై ఒత్తిడి తేవడంలో సిద్దహస్తుడు డేవిడ్ భాయ్. ఫార్మాట్ ఏదైనా క్రీజ్ లో ఉంటే చాలు.. బౌలర్లకు వణుకనే చెప్పాలి. ఇక తన సుదీర్ఘ కెరీర్ లో ఎన్నో అద్భుతమైన విజయాలను జట్టుకు అందించాడు. వీటితో పాటుగా ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.  ఎన్నో ప్రశంసలు దక్కించుకున్న వార్నర్.. విమర్శలను సైతం ఎదుర్కొన్నాడు. అదీకాక తన క్రికెట్ కెరీర్ లోనే ఓ మాయని మచ్చ ఏర్పడింది. ఆ ఒక్క మచ్చ లేకపోతే.. డేవిడ్ భాయ్ ఓ మేలిమి వజ్రమే అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్. ఇంతకీ ఆ మచ్చ ఏంటంటే?

2018 మార్చిలో ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా కేప్ టౌన్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆసీస్ ప్లేయర్ కామెరూన్ బ్యాన్ క్రాఫ్ట్ సాండ్ పేపర్ తో బంతిని రుద్దాడు. ఇది కాస్త కెమెరా కంటికి చిక్కడంతో.. బాల్ టాంపరింగ్ పై విచారణ జరిగింది. ఈ సంఘటన అప్పట్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరపగా.. ఇందులో డేవిడ్ వార్నర్ హస్తం ఉందని తేలింది. దీంతో వార్నర్ పై రెండేళ్లు నిషేధం విధించింది క్రికెట్ ఆస్ట్రేలియా.

అయితే ఆ తర్వాత అతడిపై నిషేధం ఎత్తివేసినప్పటికీ.. ఇది వార్నర్ జీవితంలో మాయని మచ్చగానే మిగిలిపోయింది. ఈ వివాద సమయంలో డేవిడ్ భాయ్ ను విమర్శలతో ముంచెత్తారు. వాటన్నింటిని తట్టుకుని రీఎంట్రీ తర్వాత అద్బుతంగా రాణించాడు. ఇక వార్నర్ టెస్ట్ కెరీర్ విషయానికి వస్తే.. 112 టెస్టుల్లో 8786 రన్స్ చేశాడు. ఇందులో 26 సెంచరీలతో పాటుగా 3 ద్విశతకాలు, 37 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇదిలా ఉండగా.. టెస్టులతో పాటుగా వన్డేలకు కూడా వార్నర్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. వార్నర్ క్రికెట్ కు గుడ్ బై చెప్పడంతో.. ఓ విధ్వంసకర బ్యాటింగ్ చూసే అదృష్టాన్ని క్రికెట్ లవర్స్ కోల్పోయారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి వార్నర్ కెరీర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి