iDreamPost

వీకెండ్స్ లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి: సురేశ్ బాబు

  • Author ajaykrishna Updated - 03:24 PM, Fri - 18 August 23
  • Author ajaykrishna Updated - 03:24 PM, Fri - 18 August 23
వీకెండ్స్ లో టికెట్ రేట్లు పెంచుకునే అవకాశం ఇవ్వండి: సురేశ్ బాబు

ఈ మధ్యకాలంలో థియేటర్స్ లో ఫుట్ ఫాల్ సంఖ్య పెరిగిందనే వార్తల్లో నిజం లేదని.. అంతా భ్రమ పడుతున్నారని అంటున్నారు సీనియర్ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ డి. సురేష్ బాబు. రీసెంట్ గా థియేటర్స్ లో టికెట్ రేట్స్ గురించి మాట్లాడిన సురేష్ బాబు.. వారాంతాలలో ఒకలా.. మిగతా రోజుల్లో ఒకలా టికెట్ ధరలు మార్చుకునే సౌలభ్యం కల్పించాలని తెలిపారు. తాజాగా థియేటర్లలో టికెట్ ధరల గురించి సురేష్ బాబు స్పందించి.. ఆయన అభిప్రాయాలను బయట పెట్టారు. ఓవర్సీస్ తో పాటు బెంగుళూరు ప్రాంతాలలో అమలు అవుతున్న టికెట్ రేట్స్ పద్ధతిని తెలుగు రాష్ట్రాలలో కూడా అమలు పరిస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.

థియేటర్స్ లో వారాంతం రోజుల్లో ఒక రకంగా.. నార్మల్ డేస్ లో మరో రకంగా ధరలు మార్చుకునే వెసులుబాటు వస్తే బాగుంటుందని అంటున్నారు సురేష్ బాబు. ఆయన మాట్లాడుతూ.. వారంలో టికెట్ ధరలు పెంచుకోవడం లేదా తగ్గించుకునే అవకాశం థియేటర్లకు కల్పించాలి. వారాంతంలో టికెట్ రేట్స్ రూ. 250 ఉంటే.. మిగతా రోజులలో రూ. 150కే అమ్ముకునే విధంగా ఉండాలి. ఆ విధంగా మాక్సిమమ్ రేట్ తో పాటు టికెట్ రేట్ తగ్గించే వీలు థియేటర్స్ కి కల్పించాలి. ఇటీవల థియేటర్స్ లో ఫుట్ ఫాల్(అక్యూపెన్సీ) పెరిగిందనే వార్తలలో నిజం లేదు. అదంతా భ్రమ మాత్రమే. కొన్ని మంచి సినిమాలకు మాత్రమే జనాలు వస్తున్నారు.” అని సురేష్ బాబు అన్నారు.

మరింత మాట్లాడుతూ.. “మేం ప్రతీ రోజు ఫుట్ ఫాల్ ని గమనిస్తున్నాం. ఎక్కడకూడా అక్యూపెన్సీ శాతం పెరిగినట్లు కనిపించలేదు. ప్రస్తుతం కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే థియేటర్స్ లో ఆదరణ పొందుతున్నాయి. జనాలు చిన్న సినిమా, పెద్ద సినిమా అని చూడట్లేదు. కంటెంట్ ఉన్నదా లేనిదా అని మాత్రమే చూస్తున్నారు. అయితే.. స్టార్ హీరోల సినిమాలు చూడటం నాకు కూడా ఇష్టమే. అందులో అన్ని రిచ్ గా ఉంటాయి. సాంగ్స్, లొకేషన్ ఇలా ఆకట్టుకుంటాయి. స్టార్ అనేది అన్ని వేళలా వర్కౌట్ కాదు. ఎందుకంటే.. రీసెంట్ రజినీకాంత్ జైలర్ సూపర్ హిట్. కానీ.. అంతకుముందు సినిమాలు ప్లాప్. ఆక్షయ్ కుమార్ OMG 2 పెద్ద హిట్. అంతకుముందు సినిమాలు ప్లాప్ అయ్యాయి. మరోవైపు విరూపాక్ష, బేబీ లాంటి చిన్న సినిమాలు పెద్ద హిట్స్ అయ్యాయి. ఇక్కడ సినిమా చిన్నది, పెద్దది కాదు.. కంటెంట్ ముఖ్యం” అంటున్నారు సురేష్ బాబు. ప్రస్తుతం సురేష్ బాబు మాటలు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి. మరి సురేష్ బాబు మాటల గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి