iDreamPost

Cyclone Michaung: గంటకు 14కి.మీ వేగంతో.. ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్!

  • Published Dec 04, 2023 | 12:25 PMUpdated Dec 04, 2023 | 12:25 PM

బంగాళా ఖాతంలో ఏర్పడి అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో మిచౌంగ్ తుఫాన్ ఏర్పడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

బంగాళా ఖాతంలో ఏర్పడి అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో మిచౌంగ్ తుఫాన్ ఏర్పడి తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

  • Published Dec 04, 2023 | 12:25 PMUpdated Dec 04, 2023 | 12:25 PM
Cyclone Michaung: గంటకు 14కి.మీ వేగంతో.. ముంచుకొస్తున్న మిచౌంగ్ తుఫాన్!

తెలుగు రాష్ట్రాలో ఇటీవల వాతావరణంలో ఒక్కసారే మార్పులు సంభవించాయి. ఆగ్నేయ బంగాళాఖాతంతో పాటు దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా వాయుగుండంగా మారింది. ఈ క్రమంలోనే మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉండబోతుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ మంగళవారం తీవ్ర రూపం దాల్చనుంది. ఇది నెల్లూరు-మచిలీపట్నం దివిసీమ వద్ద తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో భారీ నుంచి అతి బారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కోస్తా-రాయలసీమ తీరంలో అలల తీవ్రత పెరిగింది.

బంగాళాఖాతంలో మిచౌంగ్ తుఫాన్ డిసెంబర్ 5 నాటికి ఏపీలో తీరం దాటనుంది. ఇది వాయుగుండంగా మారి పెను తుఫాన్ గా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిచౌంగ్ తుఫాన్ గంటకు 14 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వాహన సంస్థ తెలియజేసింది. చెన్నైకి దాదాపు 130 కిలోమీటర్లు, నెల్లూరుకు 220 కిలోమీటర్లు, బాపట్లకు 330 కిలోమీటర్లు, మచిలీ పట్నం తీరానికి సుమారు 350 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లో సముద్రంలోకి వెటకు వెళ్లవద్దని, ఒకవేళ ఇప్పటికే వెళ్లి ఉంటే వెంటనే తిరిగి వెనక్కి రావాలని సూచించింది. మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో ఏపీ, తమిళనాడు, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది.

ఇక తమిళనాడులో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం భారీగానే చూపిస్తుంది. ఇక్కడ పడుతున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రోడ్లన్నీ చెరువులు, కుంటలు తలపిస్తున్నాయి. పలు చోట్ల ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. ఇప్పటికే ఎస్ డీఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయ్యాయి.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇక మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఏపీలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో ఏపీలో పలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వాలని విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాదు పలు జిల్లాల్లో కలెక్టరేట్లలో జరిగే స్పందన కార్యక్రమం రద్దు చేశారు. మిచౌంగ్ తుఫాన్ నేపథ్యంలో జిల్లాల కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. మిచౌంగ్ తుఫాన్ ఎఫెక్ట్ తో ఇప్పటికే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తో పాటు తిరుపతిలో భారీ వర్షాలు పడుతున్నాయి. తుఫాన్ కారణంగా జిల్లాల్లోని అధికారులకు సెలవులు రద్దు చేశారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి