iDreamPost

ప్రేమ పెళ్లి.. 4 నెలలైంది.. భోజనం తెద్దామని..

తండ్రి, కూతుళ్ల మధ్య బాండింగ్ చాలా ఢిపరెంట్. ఆమెకు ఓ స్నేహితుడు. కానీ తాను ఓ అబ్బాయిని ప్రేమించాను అనగానే.. కూతురు మనస్సు తెలుసుకోకుండా.. ఎవరు, ఎలాంటి వాడు అనేది పక్కన పెట్టి..

తండ్రి, కూతుళ్ల మధ్య బాండింగ్ చాలా ఢిపరెంట్. ఆమెకు ఓ స్నేహితుడు. కానీ తాను ఓ అబ్బాయిని ప్రేమించాను అనగానే.. కూతురు మనస్సు తెలుసుకోకుండా.. ఎవరు, ఎలాంటి వాడు అనేది పక్కన పెట్టి..

ప్రేమ పెళ్లి.. 4 నెలలైంది.. భోజనం తెద్దామని..

శాస్త్ర, సాంకేతికంగా దేశం ఎంత అభివృద్ధి చెందుతున్నా.. అమ్మాయిలు అంతరిక్షంలోకి అడుగుపెడుగుతున్నా సరే.. తల్లిదండ్రులు చూపించిన వాడినే తలొంచుకుని తాళి కట్టించుకోవాలి. లేకుంటే కనిపించని, కూడు పెట్టని పరువు పోతుంది పేరెంట్స్‌కి. ఒక వేళ అమ్మాయి.. ఓ అబ్బాయిని ప్రేమించాను అని చెప్పగానే.. కులం, గోత్రం ఏమిటనీ అడుగుతుంటారు కొందరు పేరెంట్స్. తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకపోతే.. వాడు మంచొడైనా.. రిజక్ట్ చేస్తుంటారు. పెద్ద వాళ్లను కాదని పెళ్లి చేసుకుంటే.. కూతురు, అల్లుడు అని కూడా చూడకుండా చంపేస్తుంటారు. ఇలాంటి పరువు హత్యలు నిత్యం ఎక్కడో ఓ చోట చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఈ తరహా ఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రవీణ్ అనే వ్యక్తి మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతడు షర్మిల అనే యువతిని ప్రేమించాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలన్నారు. వీరి విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. అయితే ప్రవీణ్ వేరో కులానికి చెందిన వాడు కావడంతో.. ఆమె తరుపు కుటుంబం పెళ్లికి నిరాకరించింది. దీంతో పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లై నాలుగు నెలలు అయ్యింది. కాగా, తమని కాదని షర్మిల మరో కులానికి చెందిన యువకుడ్ని పెళ్లి చేసుకోవడంతో తట్టుకోలేకపోయారు ఆమె తల్లిదండ్రులు. అతడిపై పగ పెంచుకున్నారు. శనివారం రాత్రి భోజనం తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లాడు ప్రవీణ్. సబర్బన్ పల్లికరణై వద్ద బార్ సమీపంలో ప్రవీణ్ ను షర్మిల సోదరుడు దినేష్.. అతడి స్నేహితులు చుట్టుముట్టి కత్తులతో దాడి చేశారు.

ఈ ఘటన గురించి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ప్రవీణ్‌ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. బయటకు వెళ్లిన దినేష్ ఎంతకు తిరిగి రాకపోవడంతో షర్మిలలో ఆందోళన నెలకొంది. ఆమె కన్నీరు పెట్టుకోవడంతో ఏదో జరగరానిది జరుగుతుందని ఊహించానని ప్రవీణ్ తండ్రి గోపి చెబుతున్నారు. తన కొడుకును చంపిన వ్యక్తులకు శిక్ష పడాలని కోరారు. కాగా, ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దినేష్ తో సహా ఐదుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ప్రవీణ్ 2022లో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్నాడు. 2023 నవంబర్‌లో షర్మిల, ప్రవీణ్ పెద్దల అభిష్టానికి విరుద్దంగా వివాహం చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. తదుపరి విచారణ కొనసాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి