iDreamPost

150 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని.. 230 కిమీ దూరంలో ఉన్న భార్య పుట్టింటికి వెళ్లి..

ఆడ పిల్లలకు పెళ్లి చేస్తున్నారే కానీ.. ఆ అబ్బాయి గురించి సరైన సమాచారం తెలుసుకోవడం లేదు. దీంతో ఓ మూర్ఖుడి చేతిలో అమ్మాయిని పెడుతున్నారు. పెళ్లైన నాటి నుండి ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు అటువంటి వ్యక్తులు. అనుమానిస్తూ, హింసిస్తూ, వేధిస్తున్నారు.

ఆడ పిల్లలకు పెళ్లి చేస్తున్నారే కానీ.. ఆ అబ్బాయి గురించి సరైన సమాచారం తెలుసుకోవడం లేదు. దీంతో ఓ మూర్ఖుడి చేతిలో అమ్మాయిని పెడుతున్నారు. పెళ్లైన నాటి నుండి ఆమెకు చుక్కలు చూపిస్తున్నారు అటువంటి వ్యక్తులు. అనుమానిస్తూ, హింసిస్తూ, వేధిస్తున్నారు.

150 సార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని.. 230 కిమీ దూరంలో ఉన్న భార్య పుట్టింటికి వెళ్లి..

మొబైల్ ఫోన్స్ వచ్చాక గంటలు గంటలు మాట్లాడటమే కాదూ.. చిట్ చాట్స్, సోషల్ మీడియాలో లభ్యమౌతున్న ఎంటర్‌టైన్ మెంట్ యాప్స్‌లో తల మునకలు అయిపోతున్నారు. ఇప్పుడు చిన్న పిల్లల చేతుల్లో కూడా ఫోన్లు కనిపిస్తున్నాయి. పిల్లలు అన్నం తినకపోయినా, మారాం చేసినా..చందమామను చూపించే రోజులు పోయాయి. సెల్ ఫోన్ ఇచ్చేస్తే చాలు.. వీడియోలు చూపిస్తూ, గేమ్స్ ఆడిస్తూ తినిపిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే వాళ్లే ఆపరేట్ చేసేస్తున్నారు. ఈ సెల్ ఫోన్ కారణంగా చాలా కాపురాలు కూలిపోయాయి. గొడవలు, తగాదాలు జరిగాయి. వీటి కారణంగా హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఓ ఘోరం చోటుచేసుకుంది.

భార్య ఫోన్ ఎత్తలేదని, ఏకంగా ఆమె పుట్టింటికి వెళ్లి చంపేశాడు భర్త. ఈ దారుణమైన ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ఇక్కడ భర్త పోలీస్ కానిస్టేబుల్ కావడం గమనర్హం. 150 సార్లు ఫోన్ చేస్తే.. భార్య లిఫ్ట్ చేయలేదన్న కోపంతో 230 కిమీ ప్రయాణించి మరీ హత్య చేశాడు. ఆమెపై అనుమానమే అతడిని చంపేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. కోలార్ జిల్లాలోని వీరాపురాకు చెందిన కిశోర్‌కు.. గత ఏడాది నవంబర్‌లో ప్రతిభ అనే యువతితో వివాహం జరిగింది. పెళ్లైన నాటి నుండి ప్రతిభను అనుమానించడం మొదలు పెట్టాడు కానిస్టేబుల్ భర్త కిశోర్. తరచుగా ఆమె ఫోన్ కాల్స్, మేసేజ్‌లు చెక్ చేయడం.. వాళ్లెవ్వరూ అంటూ ప్రశ్నించేవాడు. ఇంతలో ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది.

కాన్పుకోసం హోస్కోటే‌లోని పుట్టింటికి వెళ్లింది. 11 రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆదివారం సాయంత్రం కిశోర్.. ప్రతిభకు ఫోన్ చేసి తిట్టడం మొదలు పెట్టాడు. దీంతో కూతురు ఏడుస్తుంటే.. తల్లి వెంకట లక్షమ్మ ఫోన్ తీసుకుని కాల్ కట్ చేసింది. బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుందని ప్రతిభకు చెప్పి, అతడి కాల్స్ ఎత్తవద్దని చెప్పింది. ఈ క్రమంలో అతడు 150 సార్లు ఫోన్ చేసినా ఎత్తలేదు. దీంతో చామ నగర్ నుండి 230 కిలో మీటర్ల దూరంలో ఉన్న అత్తారింటికి సోమవారం ఉదయం కిశోర్ వెళ్లాడు.  వెళుతూ వెళుతూ పురుగుల మందు డబ్బా తీసుకుని వెళ్లాడు. ఆ సమయంలో అత్త డాబాపై ఉండగా.. ఇంట్లోకి వెళ్లి తలుపు గడియ పెట్టాడు.

అతడి రాకను ఎవ్వరూ ఊహించలేదు.  అతడు పురుగుల మందు తాగి, ప్రతిభను చున్నీని మెడకు బిగించి చంపాడు. తల్లి తలుపులు మూసి ఉండటాన్ని గ్రహించి.. కేకలు వేసింది. తలుపు తీయాలంటూ అల్లుడ్ని వేడుకుంది.  15 నిమిషాల తర్వాత తలుపులు తెరిచాడు కిశోర్. నేనే చంపా, నే చంపా అంటూ అక్కడ నుండి పారిపోయాడు కిశోర్. కూతురు అచేతన స్థితిలో చూసి తల్లి కన్నీరు మున్నీరు అయ్యింది. ప్రస్తుతం అతడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిశోర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. వరకట్న వేధింపులకు గురి చేస్తున్నాడని ప్రతిభ తల్లిదండ్రులు పేర్కొన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి