iDreamPost

ఆటో విషయంలో గొడవ.. సొంత అక్కను నరికి చంపిన తమ్ముడు

ఆటో విషయంలో గొడవ.. సొంత అక్కను నరికి చంపిన తమ్ముడు

ఇంట్లో ఎందరు ఉన్నా తోబుట్టిన వాళ్లతో ఉండే రిలేషన్ వేరు. అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్లు, అక్కా తమ్ముడు, అన్నా చెల్లెల్ల బంధంలో ఓ తియ్యటి మమకారం ఉంటుంది. వారితో పొద్దున గడిచింది మొదలు.. పొద్దు పోయే వారి మధ్య ప్రతి విషయంలోనూ గొడవలు జరుగుతూ ఉంటాయి. గిల్లి కజ్జాలు, కోట్లాటలు ఇళ్లు ఉండదు.ఇక ఇంట్లో తల్లిదండ్రులు లేకపోతే ఇల్లు పీకి పందిరి వేస్తుంటారు. వీరిని సవరించలేక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా అన్నా చెల్లెలు, అక్కా తమ్ముళ్లు మధ్య గొడవలు ఎలా ఉంటాయో.. ప్రేమలు కూడా ఆ స్థాయిలోనే ఉంటాయి. అవసరమైన పరిస్థితుల్లో కేర్, లవ్ చూపిస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తుంటారు. అయితే పెరిగి, పెద్దయ్యాక పెళ్లిళ్లు జరిగిన తర్వాత..బంధుత్వంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నేడు అన్నీ బంధాలు ఆర్థిక బంధాలుగా మారిపోవడంతో.. నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చేస్తున్నారు. అందుకు ఈ సంఘటనే ఓ ఉదాహరణ. సొంత అక్క అని చూడకుండా తమ్ముడు అత్యంత కిరాతంగా చంపేశాడు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

ఆటో కొనుగోలు విషయంలో అక్కా, తమ్ముళ్లకు గొడవలు జరగడంతో.. పగబట్టిన తమ్ముడు అక్కను నడిరోడ్డుపై పొట్టనబెట్టుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం గాజ్యా నాయక్ తండాకు చెందిన షేక్ రుక్సానా, యూసఫ్ అక్కా తమ్ముళ్లు. కొద్ది రోజుల క్రితం ఓ ఆటో కొనే విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో అక్క రుక్సానా తమ్ముడిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందన్న అక్కసుతో ఆమెపై పగ పెంచుకున్నాడు తమ్ముడు యూసఫ్. ఆమెను చంపేయాలని భావించాడు. మంగళవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మాచారెడ్డి రోడ్డుపై బస్సు దిగి.. గజ్యా నాయక్ తండాకు వెళుతుంది. అయితే ఆమె కోసం కాపు కాసిన తమ్ముడు..అక్కను వెంబడించి, తన వెంట తెచ్చుకున్న కత్తులతో అక్క తలపై నరికాడు. దీంతో ఆమె అక్కడిక్కడే మృతి చెందింది. రక్తపు మడుగుల్లో మహిళ మృతదేహం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరిన పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, నిందితుడు యూసఫ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. రుక్సానా మృతితో గాజ్యానాయక్ తండాలో విషాద ఛాయలు అలముకున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి