iDreamPost

భర్త కాదు రాక్షసుడు… భార్యను చంపి.. 224 ముక్కలుగా కోసి

వామ్మో వీడు మామూలోడు కాదు. మనిషి రూపంలో ఉన్న మానవ మృగం.. కట్టుకున్న భార్యలను అత్యంత ఘోరంగా హింసించే వాడు. అంతేకాకుండా..

వామ్మో వీడు మామూలోడు కాదు. మనిషి రూపంలో ఉన్న మానవ మృగం.. కట్టుకున్న భార్యలను అత్యంత ఘోరంగా హింసించే వాడు. అంతేకాకుండా..

భర్త కాదు రాక్షసుడు… భార్యను చంపి.. 224 ముక్కలుగా కోసి

వీడు అసలే మనిషేనా.. చూడటానికి భార్యతో ఎంతో ప్రేమగా నటిస్తున్న ఇతగాడు పశువు కన్నా దారుణంగా వ్యవహరించాడు. బయటకు మంచిడిలా నటించి.. భార్యను దారుణాతి దారుణంగా చంపి హత్య చేశాడు. అసలు ఆమె ఎందుకు చంపాడో ఇప్పటి వరకు తెలియకపోవడం గమనార్హం. గత ఏడాది మార్చిలో జరిగిన అతి భయంకరమైన క్రైం కేసులో నిందితుడికి ఈ సోమవారం శిక్ష పడనుంది. గత ఏడాది మార్చి 25న భార్య హెలీ బ్రామ్లీ అవశేషాలను నదిలో గుర్తించారు పోలీసులు. విచారణ చేపట్టగా.. భర్తే ఆమెను హత్య చేసి.. ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. అనంతరం ఈ నదిలో పడేసినట్లు తేలింది. అయితే తొలుత ఈ కేసులో నిందితుడు బుకాయించాడు. కాగా, అతడికి సహకరించిన వ్యక్తి నిజం పొక్కడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. బ్రిటన్‌లోని లింకన్ నగరానికి చెందిన నికోలస్ మెట్‌సన్ (28), హెలీ బ్రామ్లీ (26)భార్యా భర్తలు. అయితే గత మార్చిలో హెలీ కనిపించకుండా పోయింది. దీనిపై కేసు నమోదు కాగా, ఆమె అవశేషాలు నదిలో ప్లాస్టిక్ సంచుల్లో కనిపించాయి. కాగా, భర్త ఆమెను హత్య చేసి.. 224 ముక్కలుగా నరికి వాటిని ప్లాసిక్ కవర్లలో చుట్టి నదిలో పడేశాడు. అతడికి జాషువా హన్ కాక్ అనే ఫ్రెండ్ సాయం చేశాడు. తొలుత ఈ హత్య తాను చేయలేదని భర్త ఖండిచాడు.. చివరకు జాషువా వాంగ్మూలం ఇవ్వడంతో నేరం అంగీకరించక తప్పలేదు. దీనిపై శుక్రవారం విచారణ జరగ్గా.. జాషువాకు డబ్బులు ఇచ్చి.. ఆమె అవశేషాలను పడేయాలంటూ పేర్కొన్నట్లు బీబీసీ తన రిపోర్టింగ్‌లో పేర్కొంది. అయితే నికోలస్‌కు ఇదేమీ కొత్త కాదు.. గతంలోనే మాజీ భాగస్వామ్యులపై దాడులు చేశాడు.

2013, 2016, 2017లో మాజీ భాగస్వామ్యుల దాడుల విషయంలో దోషిగా తేలిన నికోలస్, ప్రస్తుత భార్యను ఎందుకు చంపాడనే కారణాన్ని అందించలేదు. 2021లో వివాహం చేసుకున్న ఈ జంట విడిపోయే దశలో ఉండగా, లింకన్‌లోని తమ అపార్ట్‌మెంట్‌లో హోలీని కత్తితో పలుమార్లు పొడిచి చంపాడు. అనంతరం శరీరాన్ని ముక్కలుగా కోసి సంచుల్లో కట్టి.. నదిలో పడేయాలని స్నేహితుడికి చెప్పాడు. అతడు మనుషుల్నే కాదు.. జంతువుల పట్ల కూడా క్రూరంగా వ్యవహరించేవాడు. కాగా, హోలీ కనిపించకపోవడంపై పోలీసులకు సమాచారం అందగా.. ఆమె ఉంటున్న నివాసానికి పోలీసులు వెళ్లారు. అక్కడ పోలీసులను చూసిన నికోలస్ కొత్త కథ అల్లడం స్టార్ చేశాడు. ఆమె తనపై దాడి చేసి వెళ్లిపోయిందంటూ చేతిపై గాయం గుర్తులను చూపించాడు. అయితే, పోలీసులు మార్చి 25న మళ్లీ ఇంటికి వెళ్లగా, బాత్‌టబ్‌లో రక్తపు మరకలు, మెయిన్ బెడ్‌రూమ్‌లోని నేలపై మరకలు, వంటగదిలో రంపాలు కనిపించడంతో పాటు అమ్మోనియా, బ్లీచ్ వాసన కూడా గమనించి అదుపులోకి తీసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి