iDreamPost

తండ్రి ఆశలను సమాధి చేసిన కూతుళ్లు.. ఒకే సారి

ఇద్దరు ఆడ పిల్లలు తన రెక్కల కష్టం మీద చదివిస్తున్నాడు తండ్రి. వారిద్దరిని మంచిగా చదివించి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చూడాలని ఆశపడ్డాడు. తండ్రి కలలకు తగ్గట్లే వారిద్దరూ కూడా బాగా చదువుకునే వారు.. కానీ

ఇద్దరు ఆడ పిల్లలు తన రెక్కల కష్టం మీద చదివిస్తున్నాడు తండ్రి. వారిద్దరిని మంచిగా చదివించి, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తే చూడాలని ఆశపడ్డాడు. తండ్రి కలలకు తగ్గట్లే వారిద్దరూ కూడా బాగా చదువుకునే వారు.. కానీ

తండ్రి ఆశలను సమాధి చేసిన కూతుళ్లు.. ఒకే సారి

ఇద్దరు ఆడ పిల్లలని ఆ తండ్రి దిగులు చెందలేదు. ఒక్కరు కాదూ.. ఇద్దరు మహాలక్ష్ములు తన ఇంట పుట్టాడని మురిసిపోయారు. మంచి చదువులు చదివిస్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలు డిగ్రీ చదువుతున్నారు.  ఇద్దరి చదువులు అయిపోయి.. ఉద్యోగాల్లో స్థిరపడితే.. తన కష్టం కాస్త తీరుతుందని, వారినో అయ్య చేతిలో పెట్టాలని ఆశ పడ్డాడు తండ్రి. కానీ ఆ పిచ్చి తండ్రి కలలను కల్లలు చేశారు కూతుళ్లు. క్షణికావేశంలో వారి చేసిన పిచ్చి పని తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చింది. ఒక్కరే అనుకుంటే.. ఇద్దరు అమ్మాయిలు ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేదు ఆ తల్లిదండ్రులు. ఇలా వారిని ఒంటరి చేసి వెళ్లిపోవడంతో కన్నీరు మున్నీరు అయ్యారు. అసలు ఏం జరిగిందింటే..

అనంతపురం జిల్లా శెట్టూరు మండలం యాటకల్లుకు చెందిన రైతు నారాయణ స్వామి, సరస్వతీ దంపతులకు ముగ్గురు పిల్లలు. కూతుళ్లు రూప, జ్యోతి, కుమారుడు మనోజ్ ఉన్నారు. రూప, జ్యోతి జిల్లాలోని బాలికల కళాశాలలో డిగ్రీ బీకాం కంప్యూటర్స్ చదువుతున్నారు. వ్యవసాయ పనులు చేస్తూ.. తన రెక్కల కష్టంతోనే ముగ్గురు పిల్లల్ని చదివిస్తున్నాడు తండ్రి. తమ తండ్రి కష్టాన్ని ఎరిగిన కూతుళ్లు కూడా బాగా చదువుకుంటున్నారు. అయితే సరస్వతికి కిడ్నీ సమస్య ఉండగా.. కూతుళ్లకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. వారం రోజుల కిందట గ్రామానికి వచ్చారు అమ్మాయిలు. ఇంతలో ఎవరో దగ్గరి బంధువు మృతి చెందాడన్న వార్త తెలిసి కళ్యాణ దుర్గం మండలం కుర్లపల్లి గ్రామానికి శుక్రవారం ఉదయం వెళ్లారు నారాయణ స్వామి, సర్వస్వతీ దంపతులు. తమ్ముడు పొలానికి వెళ్లడంతో.. ఇంట్లో ఇద్దరే ఉన్నారు.

అయితే తండ్రి ఏదో పనిపై ఫోన్ చేయడంతో.. ఇద్దరు కూతుళ్లు ఫోన్లు తీయలేదు. సమీప బంధువులకు ఫోన్ చేసి ఇంటికి  వెళ్లి చూడమనగా..  ఇంట్లో ఒక్కో ప్రాంతంలో ఉరికొయ్యలకు వేళాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా షాక్ గురై.. తండ్రికి చెప్పారు. వెంటనే అక్కడ ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు.. ఇద్దరు కూతుళ్లను అలా చూసి.. గుండెలు పగిలేలా ఏడ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను, బంధువులను ఆరా తీశారు. ఇద్దరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, మానసిక ఒత్తిడికి గురై చనిపోయారంటూ పోలీసులు తెలిపారు. అయితే ఇద్దర్ని మంచి చదువులు చదివించి, పెద్ద పెద్ద ఉద్యోగాల్లో చూడాలనుకున్న ఆ తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చారు రూప, జ్యోతి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి