iDreamPost

11 గదుల విలాసవంతమైన భవనంలో ఆ ముగ్గురు.. 2 రోజులుగా

అందమైన జీవితం. విదేశాల్లో చదువులు. అక్కడే సెటిల్డ్. వారికో అమ్మాయి. 11 గదుల విలాసవంతమైన భవనం. కానీ రెండు రోజుల నుండి ఎందుకో బయటకు రావడం లేదు. ఫోన్లకు స్పందించడం లేదు. బంధువు పోలీసులకు సమాచారం అందిస్తే..

అందమైన జీవితం. విదేశాల్లో చదువులు. అక్కడే సెటిల్డ్. వారికో అమ్మాయి. 11 గదుల విలాసవంతమైన భవనం. కానీ రెండు రోజుల నుండి ఎందుకో బయటకు రావడం లేదు. ఫోన్లకు స్పందించడం లేదు. బంధువు పోలీసులకు సమాచారం అందిస్తే..

11 గదుల విలాసవంతమైన భవనంలో ఆ ముగ్గురు.. 2 రోజులుగా

అమెరికాలో ఓ సంపన్న నివసిస్తోంది. 11 పడక గదుల విలాసవంతమైన భవనంలో ముగ్గురు అనుమానాస్పద రీతిలో చనిపోయి కనిపించారు. మృతులంతా భారత సంతతి చెందిన వారు. అందులో ఓ టీనేజ్ అమ్మాయి కూడా ఉంది. రెండు రోజుల నుండి ఇంట్లో నుండి ఎటువంటి అలికిడి రాలేదు. ఫోన్లకు స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన ఓ బంధువు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు. వారి ఇంటికి వెళ్లి చూడగా.. ముగ్గురు విగతజీవులుగా పడి ఉన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే క్రమంలో వారి మృతిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఎందుకంటే.. అక్కడ ఓ వెపన్ కనిపించింది.

ఇంతకు ఏమైందంటే.. డోవర్ మసాచుసెట్స్ రాజధాని బోస్టన్ డౌన్‌టౌన్‌కు నైరుతి దిశలో 32 కిలోమీటర్ల దూరంలో రాకేష్ కమల్ కుటుంబం నివసిస్తోంది. ఆయనకు భార్య టీనా, కూతురు అరియానా ఉంది. అయితే 2 రోజుల నుండి ఇంట్లో నుండి బయటకు రాకపోవడంతో బంధువు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడకు వెళ్లిన పోలీసులకు.. ముగ్గురు చనిపోయి కనిపించారు. అయితే రాకేశ్ కమల్ మృతదేహం వద్ద తుపాకీ కనిపించింది. దీంతో ఇది ఆత్మహత్య లేక హత్య అనేది దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అయితే ఈ జంట ఇటీవల కాలంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. వీరి నివసిస్తున్న భవనం 5 మిలియన్‌ డాలర్లు ఉంటుందని సమాచారం. 19వేల చదరపు అడుగుల వైశాల్యంలో ఉన్న ఆ భవంతిని 2019లో ఆ దంపతులు కొనుగోలు చేశారు.

టీనా ఢిల్లీ, హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో విద్యనభ్య సించారు. భర్త రాకేశ్ బోస్టన్‌ విశ్వవిద్యాలయం, ఎంఐటీ సోలన్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు పొందారు. వీరిద్దరూ కలిసి 2016లో ఎడ్యునోవా పేరిట విద్యారంగానికి చెందిన ఓ సంస్థను ప్రారంభించారు. ఏమైందో తెలియదు కానీ.. 2021లో ఇది క్లోజ్ అయ్యింది. అప్పటి నుండే ఆర్థిక సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. టీనా కమల్ ఎడ్యునోవా వెబ్‌సైట్‌లో కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహించినట్లు తెలిసింది. హార్వర్డ్ పూర్వ విద్యార్థి అయిన టీనా.. మసాచుసెట్స్‌లోని అమెరికన్ రెడ్‌క్రాస్‌కు డైరెక్టర్ల బోర్డులో ఒకరిగా ఉన్నారు. ఆమె ఆన్‌లైన్ బయో ఆమె విద్య, సాంకేతిక పరిశ్రమలలో మూడు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా వారి ఆస్తులు కొన్ని జప్తు అయినట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఆర్థిక సమస్యలు ఎంతటి వారినైనా కుంగదీస్తాయని చెప్పేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణ. ఏమంటారో మీ అభిప్రాాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి