iDreamPost

Game Changer: గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ పై కొత్త చర్చ.. దేవరతో పోటీనా?

డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ కి సంబంధించిన ఒక క్రేజీ అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డైరెక్టర్ శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ కి సంబంధించిన ఒక క్రేజీ అప్ డేట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Game Changer: గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ పై కొత్త చర్చ.. దేవరతో పోటీనా?

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు అందరు తమ ప్రేక్షకులు సర్ ప్రైజుల మీద సర్ ప్రైజులు ఇస్తున్నారు. అధికారికమో.. అనధికారికమో గానీ వారి వారి అభిమాన హీరోల సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ తో ఫ్యాన్స్ అయితే ఖుషీ ఖుషీగా ఉంటున్నారు. దాదాపుగా అన్ని టాప్ హీరోల సినిమాల నుంచి ఏదో ఒక అప్ డేట్ వస్తూనే ఉంది. తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్– స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ కి సంబంధించి క్రేజీ అప్ డేట్ అయితే వచ్చింది. అయితే అప్ డేట్ రావడమే కాకుండా.. దానిపై కొత్తగా చర్చ కూడా మొదలైపోయింది. మరి.. ఆ అప్ డేట్ ఏంటి? ఆ కొత్త చర్చ ఏంటో చూద్దాం.

శంకర్- రామ్ చరణ్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన చాలానే స్టోరీ లైన్స్ బయట ప్రచారంలో ఉన్నాయి. ఈ మూవీలో ప్రియమణి కీలక పాత్రలో నటిస్తోంది. రామ్ చరణ్ కూడా రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు. అయితే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటూ ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. ఇటీవల నిర్మాత దిల్ రాజు సెప్టెంబర్ నెలలో గేమ్ ఛేంజర్ రాబోతున్నాడు అంటూ యథాలాపంగా చెప్పేశారు. ఆ తర్వాత కాదు కాదు అన్నా కూడా అదే కన్ఫామ్ అని ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు.

ఇప్పుడు గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ బిజినెస్ కి సంబంధించిన క్రేజీ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే.. గేమ్ ఛేంజర్ సినిమా ఓవర్సీస్ బిజినెస్ రూ.27 కోట్లు అంటూ వార్తలు వస్తున్నాయి. అయితే సినిమా ట్రేడ్ వర్గాలు, ఇన్ సైడ్ టాక్ మాత్రం రూ.22 కోట్లు అంటూ చెబుతున్నారు. ఈ రెండింటిలో ఏ ధర ఫైనల్ అయినా కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో మాత్రం పోటీ పడుతున్నట్లే అవుతుంది. ఇప్పుడు టాలీవుడ్ లో అదే చర్చ మొదలైంది. అదేంటంటే.. ఓవర్సీస్ బిజినెస్ విషయంలో దేవర, గేమ్ ఛేంజర్ మధ్య గట్టి పోటీ నెలకొంది అంటూ చెబుతున్నారు. దేవర కూడా ఓవర్సీస్ లో రూ.27 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతోందని చెబుతున్నారు. ఆ లెక్కన శంకర్- రామ్ చరణ్ కాంబో కంటే కూడా.. తారక్- కొరటాల మూవీకే ఎక్కువ డిమాండ్ నెలకొంది అంటూ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

అయితే గేమ్ ఛేంజర్ నిజంగానే రూ.22 కోట్లతో సరిపెట్టుకుంటుందా? లేక దేవరతో పోటీకి రేటు పెంచేస్తుందా? అనేది తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. మరోవైపు దేవర రిలీజ్ విషయంలో కూడా ఒకింత సందిగ్ధిత నెలకొని ఉంది. చెప్పిన తేదీ కాకుండా.. ఆగస్టు నెలలో వచ్చేందుకు రెడీ అయిపోతున్నారని చెబుతున్నారు. అయితే ఆ తేదీలో పుష్పరాజ్ తో పోటీ పడాల్సి ఉంటుంది. మరి.. ఇంత స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ కొరటాల- తారక్ ఆ రిస్క్ తీసుకుంటారా? అంటే కష్టమనే చెప్పాలి. ఇంక గేమ్ ఛేంజర్ రిలీజ్ మాత్రం సెప్టెంబర్ నెలలోనే అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. మరి.. గేమ్ ఛేంజర్ ఓవర్సీస్ ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి