iDreamPost

Kalki 2898 AD: పండగ పూట ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. ఈవాళ సాయంత్ర కల్కి అప్డేట్‌

  • Published Mar 08, 2024 | 11:47 AMUpdated Mar 08, 2024 | 11:47 AM

ఇప్పుడు అందరూ ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ కోసమే ఎదురుచూస్తున్నారు. వరుసగా ఈ సినిమా గురించి లీక్స్ , అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో అప్ డేట్ ఫ్యాన్స్ కు హోప్స్ పెంచేస్తుంది.

ఇప్పుడు అందరూ ప్రభాస్ నటిస్తున్న కల్కి మూవీ కోసమే ఎదురుచూస్తున్నారు. వరుసగా ఈ సినిమా గురించి లీక్స్ , అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు మరో అప్ డేట్ ఫ్యాన్స్ కు హోప్స్ పెంచేస్తుంది.

  • Published Mar 08, 2024 | 11:47 AMUpdated Mar 08, 2024 | 11:47 AM
Kalki 2898 AD: పండగ పూట ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. ఈవాళ సాయంత్ర కల్కి అప్డేట్‌

రెబల్ స్టార్ ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ప్రస్తుతం వస్తున్న సినిమా “కల్కి 2898AD”. ఇప్పుడు అందరి ఆశలు, ఎదురు చూపులు ఈ సినిమా గురించే. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా బడ్జెట్ గురించి కూడా ఇప్పటివరకు ఎన్నో వార్తలు వింటూ వస్తున్నాం. అసలే అందరు ఓ రేంజ్ లో ఈ సినిమా గురించి ఎక్సపెక్టషన్స్ పెంచుకుంటున్నారంటే.. ఇక ఈ మధ్య కాలంలో ఈ సినిమా గురించి ఒక్కొక్కటిగా వస్తున్న అప్ డేట్స్ మరిన్ని ఆశలని పెంచేస్తుంది. అసలు ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాకముందే.. ఈ రేంజ్ డిస్కషన్స్ జరుగుతున్నాయంటే.. ఇక రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి హడావిడి చేస్తుందో.. ఈపాటికే అందరికి ఊహాగానాలు మొదలైపోయి ఉంటాయి. ఈ క్రమంలో శివరాత్రి ఓ స్పెషల్ పోస్టర్ తో ఈ సినిమా గురించి లేటెస్ట్ అప్ డేట్ రాబోతుందట. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

ఇక “కల్కి 2898 AD” చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్నారు. ఈ సమ్మర్ లో మే 9న ఈ సినిమాను విడుదల చేసేందుకు సిద్ధం అవుతున్నారు మేకర్స్. అలానే ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా ఉండబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ కంప్లీట్ అయిందని.. సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఇటీవల ఈ చిత్రం షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా లీక్ అయ్యాయి. అలా ఈ సినిమా గురించి నిత్యం సోషల్ మీడియాలో ఎదో ఒక బజ్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా ఇప్పుడు మహాశివరాత్రి సందర్బంగా.. ఈరోజు సాయంత్రం 5గంటలకు ఈ మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ తో.. కల్కి మూవీ లో ప్రభాస్ పేరు ఏంటి అనేది రివీల్ చేస్తామని .. చిత్ర బృందం ప్రకటించింది. ఇక ఈ వార్త ఫ్యాన్స్ కు పండుగల మారింది. కల్కి సినిమాలో ప్రభాస్ పేరుతో దాదాపు హీరో క్యారెక్టర్ ఏంటి అనేది గెస్ చేయొచ్చని .. అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక కల్కి మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్.. లాంటి భారీ తారాగణం కీలకపాత్రలలో నటిస్తున్నారన్న సంగతి కూడా తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా గురించి వస్తున్న అప్ డేట్స్ పై ఇన్ని ఆశలు పెట్టుకుంటున్న ఫ్యాన్స్ .. సినిమా రిలీజ్ అయినా తర్వాత ఎటువంటి హడావిడి చేస్తారో.. అందరి ఊహించవచ్చు. మరి ఈ సినిమా థియేటర్ లో విడుదల అయిన తరవాత ఇంకెంత క్రేజ్ ను తెచుకుంటుందో వేచి చూడాలి. అలాగే ఈలోపు ఈ మూవీపై ఇంకెన్ని అప్ డేట్స్ వస్తాయో అవి ఇంకెంత ఎక్సయిట్మెంట్ ను పెంచుతాయో అని.. అందరూ ఇంకాస్త ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి, శివరాత్రి సందర్బంగా రాబోతున్న కల్కి మూవీ అప్ డేట్ పై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి