iDreamPost

పవన్ కల్యాణ్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!

పవన్ కల్యాణ్‌పై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు!

మంగళవారం ఢిల్లీలో నిర్వహించబోయే ఎన్డీఏ మిత్రపక్ష కూటమి సమావేశానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. బీజేపీ ఆహ్వానం అందించిన పార్టీల్లో ఏపీ నుంచి జనసేన మాత్రమే ఉంది. బీజేపీ ఆహ్వానం మేరకు పవన్ ఎన్టీఏ మిత్రపక్ష కూటమి సమావేశానికి హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ నిర్వహించే ఎన్డీఏ సమావేశానికి పవన్ కల్యాణ్ వెళ్లడాన్ని నారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. పవన్ ప్రయాణం చేగువేరా నుండి సావర్కర్ వరకు జరిగిందన్నారు. ఆయన రాజకీయ దళారిలా వ్యవహిస్తున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మంగళవారం ఢిల్లీలో ఉన్న ఆయనను మీడియా పలకరించింది. ఎన్టీఏ మిత్రపక్ష కూటమి సమావేశానికి పవన్ వెళ్లనున్నడంపై మీడియా ప్రశ్నించగా.. హాట్ కామెంట్స్ చేశారు. ఎన్డీఏ కూటమి సమావేశానికి పవన్ ఎందుకు వెళ్లారో ప్రజలకు వివరించాలని నారాయణ డిమాండ్ చేశారు. చేగువేరా డ్రెస్ తీసేసి.. మితవాదుడైన సవర్కర్ పాలసీలోకి వెళ్లడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. రేపు గాడ్సేలా తుపాఖీ పట్టుకునేందుకు కూడా సిద్ధమవుతాడని ఆయన అన్నారు. గతంలో బీజేపీ ఇచ్చిన ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డులతో పోల్చిన పవన్.. అలాంటి కూటమిలో నేడు ఎలా చేరుతున్నారో చెప్పాలంటూ మండిపడ్డారు. పవన్ తీరు బాధాకరమని, ఈ తీరు సరికాదని నారాయణ ఆక్షేపించారు.

“అసలు పవన్ కల్యాణ్ కి నిలకడ లేదు. కదలకుండా మూడు నిమిషాలు మాట్లాడగలిగితే.. ఆ తరువాత పవన్ రాజకీయం గురించి మాట్లాడుకోవచ్చు” ఆయన అన్నారు. పొలిటికల్ లో పవన్ ఒక దళారీగా వ్యవహరిస్తున్నారని, అందుకే టీడీపీ-బీజేపీ మధ్య పొత్తుకోసం ప్రయత్నాలు చేస్తున్నాడని ఆరోపించారు. ఈ దళారి తనం పవన్ కల్యాణ్ కు మంచిది కాదని నారాయణ విమర్శించారు. పవన్ బీజేపీతో కలవడం లౌకిక వాదానికి ప్రమాదకరమని ఆయన అన్నారు. మరి.. పవన్ కల్యాణ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారయణ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి:  జగనన్న తోడు నిధులు విడుదల.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి