iDreamPost

ఒకే రోజు..విమాన ప్రమాదాలు..మృత్యువును జయించిన జంట!

ప్రమాదం ఎప్పుడు ఓ రూపంలో వస్తుందో ఎవరం చెప్పలేము. అయితే కొన్ని సార్లు ఘోరమైన ప్రమాదాలు జరిగినా కూడా కొందరు ప్రాణాలతో బయటపడుతుంటారు. అలా మృత్యువును జయించిన ఓ జంట కథ సోషల్ మీడియాలో వైరల్అవుతోంది.

ప్రమాదం ఎప్పుడు ఓ రూపంలో వస్తుందో ఎవరం చెప్పలేము. అయితే కొన్ని సార్లు ఘోరమైన ప్రమాదాలు జరిగినా కూడా కొందరు ప్రాణాలతో బయటపడుతుంటారు. అలా మృత్యువును జయించిన ఓ జంట కథ సోషల్ మీడియాలో వైరల్అవుతోంది.

ఒకే రోజు..విమాన ప్రమాదాలు..మృత్యువును జయించిన జంట!

మనిషి ప్రాణం నీటిలో బుడగలాంటిది. అలా వచ్చి ఎప్పుడు టప్ అంటుందో ఎవరం చెప్పలేము. అలానే  ఎప్పుడు ఏ మనిషి ప్రాణాలు ఎలా పోతాయో ఎవరం ఊహించలేము. క్షణం ముందు వరకు మనకు చక్కగా కనిపించిన వ్యక్తి కాసేపటి తరువాత భూమి మీద నూకలు చెల్లి.. మృత్యు ఒడికి చేరుతారు. కానీ భూమీ మీద నూకలు ఉంటే మాత్రం ఎంత పెద్ద ప్రమాదం జరిగిన..ప్రాణాలతో బయట పడతారు. అలాంటి ఘటనలు అనేకం జరిగాయి. తాజాగా ఓ దంపతులు కూడా రెండు వేరువేరు విమానాల ప్రమాదలకు గురై..తృటిలో మృత్యు నుంచి తప్పించుకున్నారు. మరి.. ఆ ఘటన పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఒకే రోజు.. రెండు వేర్వేరు విమాన ప్రమాదాలు జరిగాయి. వాటి నుంచి బయటపడిన ఓ జంట సంబంధించిన ఓ అద్భుతమైన స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యూరప్ లోని ఉత్తర ఇటలీ నగరమైన టూరిన్ లో స్టెఫానో పిరిల్లి (30) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి ఆంటోనియెట్టా డెమాసి(22) అనే యువతితో వివాహం నిశ్చయమైంది. ఇక స్టెఫానో  తనకు కాబోయే భార్య డెమాసి టురిన్‌లో స్నేహితులతో కలిసి భోజనం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే వీరిద్దరు  వేర్వేరు తేలికపాటి విమానాలలో స్నేహితుల వద్దకు బయలుదేరారు. తిరిగి వస్తుండగా స్టెఫానో ప్రయాణిస్తున్న రెండు సీట్ల టెక్నామ్ పీ-92 ఎకో సూపర్‌లో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ క్రమంలోనే స్టెఫాన్ ప్రయాణిస్తున్న విమానం శాన్ గిల్లియో వద్ద కూలిపోయింది.  ఇదే సమయంలో అతడికి కాబోయే భార్య ఆంటోనీ ప్రయాణిస్తున్న విమానం కూడా బుసాన్ వద్ద కూలిపోయింది. రెండు  ప్రమాదాలు జరిగిన ప్రాంతాలకు అగ్నిమాపక సిబ్బంది వచ్చారు. ప్రమాదాల్లో గాయపడిన ఈ జంటతో పాటు పైలట్ ను కాపాడి ఆస్పత్రికి తరలించారు

ఒక విమాన ప్రమాద ఘటనలో స్టెఫానో  గాయలై..ప్రాణాలతో తప్పించుకున్నాడు. అలానే మరో ప్రమాదంలో ఆంటోనీయెట్టా డెమాసితో పాటు పైలట్ గాయపడ్డారు. ఈ ప్రమాద ఘటనపై స్థానిక అధికారులు స్పందించారు. అలానే ఉష్ణోగ్రతలు పడిపోవడం, పొగమంచు అధికంగా ఉంటంతో ఈ ప్రమాదాలు జరిగినట్లు తెలుస్తోంది. ఈ రెండు ప్రమాదా ఘటనలపై పౌర విమానయాన అధికారులు విచారణ జరుపుతున్నారు.

త్వరలో స్టెఫానో, ఆంటోనీయెట్టా జంట ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరు వేర్వేరు విమానాల్లో ప్రయాణిస్తున్నప్పటికీ, ఆ రెండు ఒకేసారి ప్రమాదానికి గురి కావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అలానే వారిద్దరు ప్రాణాలతో బయటపడటం ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి విషయంలో అద్భుతం జరిగిందని చెప్పాలి. మృత్యువును జయించిన జంట అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి.. విచిత్రమైన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి