iDreamPost

తపాల శాఖతో సామాన్య మహిళ పోరాటం.. రూ.2.13 లక్షల పరిహారం!

ప్రస్తుత సమాజంలో మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు. అంతేకాక సమస్యలపై పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు. అలానే ఓ సామాన్య మహిళ ..తపాల శాఖతో పోరాటం చేసి విజయం సాధించింది.

ప్రస్తుత సమాజంలో మహిళలు అన్నిరంగాల్లో దూసుకెళ్తున్నారు. అంతేకాక సమస్యలపై పోరాడేందుకు సిద్ధంగా ఉంటారు. అలానే ఓ సామాన్య మహిళ ..తపాల శాఖతో పోరాటం చేసి విజయం సాధించింది.

తపాల శాఖతో సామాన్య మహిళ పోరాటం.. రూ.2.13 లక్షల పరిహారం!

నేటికాలంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు. అంతేకాక ఏదైనా సమస్య వస్తే పోరాడేందుకు కూడా వెనుకాడటం లేదు. ఆడవారే కదా ఏం చేస్తారులే అని కొందరు చులకన భావనతో చూస్తుంటారు. అందుకే మహిళలు తమ సమస్య గురించి తెలిపిన.. సరిగ్గా పట్టించుకోరు.  అలాగే తన సమస్యను పట్టించుకోని తపాల శాఖపై ఓ మహిళా పోరాటం చేసింది. మూడేళ్లు పోరాడి.. చివరకు పోస్టల్ డిపార్ట్మెంట్ పై విజయం సాధించింది. ఆ శాఖ నుంచి నష్ట పరిహారంగా రూ.2.13 లక్షలను పొందింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలోని కావలి పట్టణంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన అనుమకొండ వెంకట రత్నమ్మ 2020 మార్చి 23న తపాల ఏజెంట్ కు రూ.30 లక్షల చెక్కు ఇచ్చారు. ఏడాదికి 7.7 శాతం వడ్డీ రేటుతో 5 ఏళ్లు ఫిక్స్ డిపాజిట్ ఖాతా తెరవమని వెంకట రత్నమ్మ చెప్పారు.  అలానే అదే రోజు పోస్టాఫీస్ లో అకౌంట్ తెరుస్తానని చెప్పి.. ఏజెంట్‌ చెక్కును కావలి పోస్టుమాస్టర్‌కు అందజేశాడు. రోజులు గడుస్తున్న వారి దగ్గర నుంచి రత్నమ్మకు ఎలాంటి సమాచారం లేదు. తన ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ విషయంపై ఎలాంటి సమాచారం తెలియకపోవడంతో ఏప్రిల్ 2న బాధితురాలు తపాలా శాఖకు ఫిర్యాదు చేశారు.

ఆమె స్పందించిన అధికారులు డాక్యుమెంట్లు పరిశీలించిన తరువాత మార్చి 30న చెక్కును పోస్టు మాస్టర్  బ్యాంకుకు పంపారు. ఏప్రిల్ 2న డబ్బులు తపాలా శాఖ ఖాతాలోకి జమ అయినట్లు పోస్టుమాస్టర్  ఏప్రిల్ 28న సమాధానం ఇచ్చారు. అంతేకాక కేంద్రం ఏప్రిల్ 1 నుంచి వడ్డీని 7.7 నుంచి  6.7 శాతానికి తగ్గించింది. ఇదే విషయాన్ని పోస్టుమాస్టర్ ప్రస్తావిస్తూ.. ఏప్రిల్ 2న డబ్బు జమకావడంతో అదే రోజున ఉన్న 6.7 శాతం వడ్డీ ప్రకారం అకౌంట్ తెరిచామని పేర్కొన్నారు.

అయితే వెంకట రత్నమ్మ మాత్రం అందుకు ససేమిరా అన్నారు. తాను మార్చి 23నే చెక్కు అందించానని, అప్పుడు 7.7 శాతం వడ్డీతో ఖాతా ఉండాలని అభ్యర్థించారు. అయినా తన మాటలను పోస్టుమాస్టర్ పట్టించుకోలేదంటూ బాధితురాలు కన్జ్యూమర్ కోర్టును ఆశ్రయించారు. అయితే కరోనా కారణంగా సగం మంది సిబ్బంది విధులకు హాజరు కావడంతో చెక్కును ఆలస్యంగా బ్యాంకుకు పంపించారని పోస్టల్ శాఖ తరపు లాయర్లు కోర్టుకు తెలియజేశారు. ఏప్రిల్‌ 2న జమ కావడంతో అదే రోజు ఖాతాను తెరిచామని.. తమ తప్పు లేదని తపాలా శాఖ తరఫు లాయర్లు వాదించారు. ఇరువైపు వాదనలు విన్న వినియోగదారుల ఫోరం సంచలన తీర్పు ఇచ్చింది.

ఈ కేసులో తపాలశాఖదే తప్పు అన్నట్లు కోర్టు నిర్ధారించింది. కేసును విచారణ చేసిన జడ్జీ.. ఏప్రిల్‌ 2 వరకు జమ చేయకపోవడం తపాలా శాఖ సేవా లోపమని స్పష్టం చేశారు. ఇందుకు నష్టపరిహారంగా రూ.1,58,247, బాధితురాలి మానసిక ఆవేదనకు రూ.50 వేలు, ఆమె కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5 వేలు చెల్లించాలని ఆదేశించారు. మొత్తంగా ఆమె తపాలా శాఖపై పోరాటం చేసి విజయం సాధించారు. తపాల శాఖ నుంచి రూ.2.13 లక్షల పరిహారాన్ని ఆమె పొందారు. అన్యాయం జరిగితే ధైర్యంగా పోరాడాలని.. తప్ప విజయం సాధిస్తామని.. ఈ మహిళ నిరూపించింది. ఈమె పోరాటం ఎంతో మంది మహిళలకు  ఆదర్శంగా నిలిచారు. మరి… ఈ మహిళ పోరాటంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి