iDreamPost

అధికారంలోకి కాంగ్రెస్! ప్రొఫెసర్ కోదండరాంకు పదవి ఛాన్స్!

Kodandaram: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 119 స్థానాలకు గాను కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కృషి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు కీలక పదవి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.

Kodandaram: తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 119 స్థానాలకు గాను కాంగ్రెస్ 64 స్థానాల్లో విజయం సాధించింది. ఈ విజయంలో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కృషి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆయనకు కీలక పదవి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.

అధికారంలోకి కాంగ్రెస్! ప్రొఫెసర్  కోదండరాంకు పదవి ఛాన్స్!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముగిశాయి. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఎన్నికల్లో చివరకు కాంగ్రెస్ విజయం సాధించింది. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ను కాదని కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు అధికారం కట్టబెట్టారు. అయితే ఈ సారి కాంగ్రెస్ విజయం సాధించడంలో అనేక మంది కీలక పాత్ర పోషించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, అవినీతి జరిగిదంటూ కీలక అంశాలన ప్రజలకు తెలియజేయండం చేశారు.ఇక కాంగ్రెస్ విజయంలో టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం పాత్ర కూడా ఉంది. టీజేఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి పనిచేయమని పిలుపునిచ్చి..హస్తం విజయానికి చేసిన కృషి ఫలించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయనకు కీలక పదవి ఇచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మోజార్టీ స్థానాలు గెలుచుకని కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది. నేడో రేపో ప్రభుత్వం కొలువుదీరనుంది. ఇక  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంటో టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం వంటి మేధావులు  చేసిన కృషి ఫలించింది. ఆయన కేసీఆర్ ను ఓడించాల్సిందే అంటూ  ప్రతి సమావేశంలో చెబుతూ వచ్చారు. అంతేకాక కేసీఆర్ ను ఓడించేందుకు అందరూ కలిసి పోటీ చేయాలని ఆయన  సూచించారు. ఈ నేపథ్యంలోనే  2023 ఎన్నికల్లో టీజేఎస్ పోటీకి దూరంగా ఉండటమే కాకుండా.. కాంగ్రెస్ కు పూర్తి మద్దతు కూడా ప్రకటించింది.

టీజేఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని సూచించారు. వీరి కృషి ఫలించి.. కాంగ్రెస్ మేజిక్ ఫిగర్ దాటి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇదే సమయంలో కోదండరాంకు కాంగ్రెస్ సర్కార్ కీలక బాధ్యతలు అప్పగిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఆయన్ను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి కూడా ఇచ్చే అవకాశంఉన్నట్లు పొలిటికల్ సర్కిల్  లో వార్తల వినిపిస్తున్నాయి. విద్యావంతుడైనా కోదండరాంకు విద్యాశాఖను ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఒక వేళ అది కుదరకపోతే… టీఎస్పీఎస్సీ ఛైర్మన్ గా నియమించాలని కాంగ్రెస్ భావిస్తోందట.

కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంలో నిరుద్యోగులది కీలకపాత్ర. బీఆర్ఎస్ ను ఓడించడంలో నిరుద్యోగులే కారణమని చాలా మంది అభిప్రాయా పడుతున్నారు. తాము అధికారంలోకి వస్తే టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని కాంగ్రెస్ హామి ఇచ్చింది. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ  ఛైర్మన్‌గా నిరుద్యోగుల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, తెలంగాణ ఉద్యమకారుడు కోదండరాంకు ఇవ్వాలని హస్తం యోచిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అదే విధంగా.. ఇక ఆయనను పెద్దలు రాజ్యసభ అవకాశమిస్తామని అప్పట్లో హామీ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఆయనకు ఏ పదవి ఇవ్వనున్నారనేది క్లారీటీ మాత్రం లేదు. అదే విధంగా కోదండరాం కి పదవి ఇచ్చే అంశం మరికొద్ది రోజుల్లో తేలియనుంది. మరి.. కోదండరాం కి కీలక పదవ అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి