iDreamPost

చిన్నవయసులోనే కమెడియన్ నీల్ నందా హఠాన్మరణం!

ఈ మద్య సినీ ఇండస్ట్రీలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటులు కన్నుమూయడంతో దుఖఃంలో మునిగిపోతున్నారు అభిమానులు.

ఈ మద్య సినీ ఇండస్ట్రీలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాము ఎంతగానో అభిమానించే నటులు కన్నుమూయడంతో దుఖఃంలో మునిగిపోతున్నారు అభిమానులు.

చిన్నవయసులోనే కమెడియన్ నీల్ నందా హఠాన్మరణం!

ఇటీవల సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, రోడ్డు ప్రమాదాలు, కెరీర్ సాఫీగా లేక ఆర్ధిక ఇబ్బందులతో ఆత్మహత్యలకు పాల్పపడటం లాంటివి జరుగుతున్నాయి. దీంతో వారి కుటుంబాల్లోనే కాదు.. అభిమానులు సైతం తీవ్ర విషాదంలో మునిగిపోతున్నారు. గత వారం ప్రముఖ కమెడిన్ రాజు శ్రీ వాస్తవ కన్నుమూశారు. ఆ బాధ మరువకముందే.. తమిళ స్టార్ కమెడియన్ బోండా మణి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఈ బాధ నుంచి కోలుకోక ముందే.. ప్రముఖ హాలీవుడ్ కమెడియన్ కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..

హాలీవుడ్ స్టాండప్ కమెడియన్ నీల్ నందా (32) హఠాన్మరణం అందరినీ షాక్ కి గురి చేసింది. తాము ఎంతగానో అభిమానించే కమెడియన్ కన్నుమూయడంతో ఫ్యాన్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 32 ఏళ్ల నీల్ నందా చిన్నవయసులో చనిపోవడంతో హాలీవుడ్ ప్రముఖులు నివాళులర్పించారు. నీల్ నందా కమెడియన్ గానే కాకుండా మంచి రచయిత. జిమ్మీ కిమ్మెల్, కామెడీ సెంట్రల్ ఆడమ్ డివైన్స్ హౌజ్ పార్టీ వంటి షో, వైస్ ల్యాండ్, హులు అనే కామెడీ షోల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మరణాన్ని మేనేజర్ గా వ్యవహరిస్తున్న గ్రేగ్ వీస్ అధికారికంగా ద్రువీకరించారు. కాకపోతే అతనిది సహజ మరణమా, ఆత్మహత్య చేసుకున్నాడా అన్న విషయం మాత్రం కుటుంబ సభ్యులు ధృవీకరించలేదు.

comedian neen nanda passed away

ఎంతో బంగారు భవిష్యత్ ఉన్న నీల్ నందా ఇంత చిన్న వయసులో చనిపోవండం దిగ్భ్రాంతికి గురిచేసిందని., అతను గొప్ప కామిక్ అంటూ గ్రేగ్ వీస్ ఆవేదన వ్యక్తం చేశారు. భారత సంతతికి చెందిన నీల్ నందా మరణానికి గల కారణాలు తెలియరాలేదు. 2013లో ప్రముఖ షో జిమ్మీ కమ్మెల్ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించారు. అతి తక్కువ కాలంలోనే తనదైన పర్ఫామెన్స్ తో అందరి మనసు దోచాడు. నీల్ నందా ఎక్కువగా అట్లాంటాలోనే ఎక్కువ ప్రదర్శనలు ఇచ్చారు. నీల్ నందా అమెజాన్ ప్రైమ్ షోలు ఇన్ సైడ్ జోక్స్, హులు కమింగ్ టూ ది స్టేజ్ లో కూడా కనిపించి అందరినీ నవ్వించారు. నీల్ నందా మరణ వార్త విని షాక్ కి గురయ్యాను.. కష్టపడి పనిచేసేవారిలో ఆయన ఒకరు అంటూ అమెరికన్ నటుడు మాట్ రైఫ్ అన్నారు. నీల్ నందా మరణ వార్త సోషల్ మీడియాలో వ్యాపించగానే నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.. ఆయన నివాళులర్పిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి