iDreamPost

ILT20 2024: వీడియో: క్లియర్ గా రనౌట్.. అయినా బ్యాటింగ్ చేసిన ప్లేయర్! కారణం?

ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా తాజాగా డెసర్ట్ వైపర్స్-షార్జా వారియర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ దృశ్యం చోటు చేసుకుంది. షార్జా బ్యాటర్ మార్టిన్ గప్టిల్ ఈ మ్యాచ్ లో క్లీయర్ గా రనౌట్ అయ్యాడు. అంపైర్ కూడా అవుట్ ఇచ్చాడు. కానీ గప్టిల్ మాత్రం పెవిలియన్ చేరలేదు.

ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా తాజాగా డెసర్ట్ వైపర్స్-షార్జా వారియర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ దృశ్యం చోటు చేసుకుంది. షార్జా బ్యాటర్ మార్టిన్ గప్టిల్ ఈ మ్యాచ్ లో క్లీయర్ గా రనౌట్ అయ్యాడు. అంపైర్ కూడా అవుట్ ఇచ్చాడు. కానీ గప్టిల్ మాత్రం పెవిలియన్ చేరలేదు.

ILT20 2024: వీడియో: క్లియర్ గా రనౌట్.. అయినా బ్యాటింగ్ చేసిన ప్లేయర్! కారణం?

సాధారణంగా క్రికెట్ లో కొన్ని కొన్ని చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటూ ఉంటాయి. అందులో కొన్ని నవ్వులు పూయిస్తే.. మరికొన్ని వివాదాలకు దారిసేలా ఉంటాయి. కాగా.. ప్రస్తుతం ఇంటర్నేషనల్ లీగ్ టీ20 2024 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ లీగ్ లో భాగంగా తాజాగా షార్జా వేదికగా డెసర్ట్ వైపర్స్ వర్సెస్ షార్జా వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఇక ఈ పోరులో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. షార్జా బ్యాటర్ మార్టిన్ గప్టిల్ క్లీయర్ గా రనౌట్ అయ్యాడు. అంపైర్ కూడా అవుట్ ఇచ్చాడు. కానీ గప్టిల్ మాత్రం పెవిలియన్ చేరలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో భాగంగా తాజాగా డెసర్ట్ వైపర్స్-షార్జా వారియర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఓ ఇంట్రెస్టింగ్ దృశ్యం చోటు చేసుకుంది. షార్జా బ్యాటర్ మార్టిన్ గప్టిల్ క్లియర్ గా రనౌట్ అయినప్పటికీ.. అతడు మాత్రం బ్యాటింగ్ కొనసాగించాడు. ఇంతకీ అసలేం జరిగిందంటే? షార్జా వారియర్స్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో ఇన్నింగ్స్ 12వ ఓవర్ లో షాదాబ్ ఖాన్ వేసిన ఓ బాల్ ను జో డెన్లీ స్ట్రైట్ గా బలంగా షాట్ కొట్టాడు. ఆ బాల్ నేరుగా నాన్ స్ట్రైకర్ ఎండ్ లో ఉన్న మార్టిన్ గప్టిల్ కు గట్టిగా తాకింది. దాంతో అతడు అక్కడే కింద పడ్డాడు. అతడు క్రీజ్ బయట ఉండటాన్ని గమనించిన షాదాబ్ బాల్ తో వికెట్లను కొట్టాడు. రనౌట్ కు అప్పీల్ చేయడంతో.. అంపైర్ సైతం అవుట్ ఇచ్చాడు.

అయితే ఇక్కడే తన క్రీడా స్ఫూర్తిని చాటుకున్నాడు డెసర్ట్ వైపర్ సారథి కొలిన్ మున్రో. షాదాబ్ తో మాట్లాడి తన అప్పీల్ ను వెనక్కి తీసుకోమన్నాడు. దాంతో గప్టిల్ తిరిగి ఆటను కొనసాగించాడు. దెబ్బ తగిలి నొప్పితో బాధపడుతున్న ప్లేయర్ ను అవుట్ చేయడం కరెక్ట్ కాదని భావించిన మున్నో ఈ నిర్ణయం తీసుకున్నాట్లుగా తెలుస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో డెసర్ట్ టీమ్ 7 పరుగుల స్వల్ప తేడాతో పరాజయం పాలైంది.  అయినప్పటికీ.. తన క్రీడా స్ఫూర్తితో క్రికెట్ ప్రేమికుల ప్రశంసలు పొందుతున్నాడు మున్రో. కాగా.. మున్రో, మార్టిన్ గప్టిల్ ఇద్దరూ న్యూజిలాండ్ టీమ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. మరి మున్రో చేసిన మంచి మనసు చాటుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి