iDreamPost

ICID సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

ప్రతిష్ఠాత్మక ICID 25వ అంతర్జాతీయ సదస్సుకు  ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిచ్చింది. ఏపీలోని విశాఖలో  ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు 74 దేశాల అంబాసిడర్లు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు అతిథ్యమిస్తోంది. ఈ సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రతిష్ఠాత్మక ICID 25వ అంతర్జాతీయ సదస్సుకు  ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిచ్చింది. ఏపీలోని విశాఖలో  ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు 74 దేశాల అంబాసిడర్లు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు అతిథ్యమిస్తోంది. ఈ సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ICID సదస్సులో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు!

ప్రతిష్ఠాత్మక ICID 25వ అంతర్జాతీయ సదస్సుకు  ఆంధ్రప్రదేశ్ ఆతిథ్యమిచ్చింది. ఏపీలోని విశాఖలో  ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు 74 దేశాల అంబాసిడర్లు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు అతిథ్యమిస్తోంది. ఇప్పటికే జీఐఎస్, జీ 20 సదస్సులతో ప్రపంచం దృష్టిని ఆకర్షించిన వైజాగ్ ..తాజాగా ఐసీఐడీ సదస్సుకు వేదిక అయింది. సెంట్రల్ వాటర్ కమిషన్, ఏపీ జలవనరుల శాఖ సంయుక్త ఆధ్వర్యంలో రాడిసన్ బ్లూ హోటల్ లో ఈ సదస్సు ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయం నీటి కోరతను అధికమించడం అనే థీమ్ తో నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఐసీఐడీ 25వ ఇంటర్నేషనల్ సదస్సులో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన ఐసీఐడీ సదస్సుకు ఆతిథ్యమిస్తుండటం ఎంతో గర్వంగా ఉందని సీఎం జగన్‌ అన్నారు. భారీ సముద్ర తీరం ఉన్నప్పటికీ రాష్ట్రంలో కొన్ని చోట్ల కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయని సీఎం తెలిపారు. వాతావరణ మార్పుల కారణంగా వర్షాలు కురిసే రోజులు తగ్గిపోయాయని, కానీ వానలు కురిసినప్పుడు మాత్రం భారీగానే ఉంటుందనే విషయాన్ని నిపుణుల దృష్టికి సీఎం జగన్ తీసుకొచ్చారు. ఇంకా సీఎం జగన్ మాట్లాడుతూ..ఏపీలో సాగునీటి రంగం, వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. ఏపీకి విస్తారమైన తీర ప్రాంతం ఉందని, ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవడమే లక్ష్యమని సీఎం జగన్ అన్నారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని పలు ప్రాంతాల్లో తరచూ కరువు వస్తోందని ఈ సందర్బంగా సీఎం తెలిపారు.

వర్షం కురిసేది తక్కువ కాలమే.. ఆ నీటిని సంరక్షించుకుని వ్యవసాయానికి వాడుకోవాలన్నారు. సదస్సు నిర్వహణకు ఏపీకి అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. ఇక ఈ సదస్సులో సంప్రదాయ నీటివనరులను అభివృద్ది చేయడం, నీటిపారుదల వ్యవస్థలను మెరుగుపరచడం, వాన నీటిని సంరక్షణ, పొలాల్లో వర్షపునీటిని ఒడిసి పట్టేందకు మార్గాలు, భూగర్భ జలాల పెంపుదల , మురుగునీటిని సాగునీటిగా ఉపయోగించుకునేందుకు ఉన్న మార్గాలు, అధిక దిగుబడుల కోసం నీటి వినియోగంపై చర్చిస్తారు. మరి.. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి