iDreamPost

విశ్వసనీయత లేని చంద్రబాబు ఎక్కడ ఉన్నా ఒకటే: CM జగన్

విశ్వసనీయత లేని చంద్రబాబు ఎక్కడ ఉన్నా ఒకటే: CM జగన్

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే  అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికలకు కసరత్తులు చేస్తున్నాయి. ఇక రాష్ట్రంలో 175కు 175 స్థానాల్లో విజయమే లక్ష్యంగా ఎన్నికలకు శ్రేణులను సమాయత్తం చేసేందుకు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సన్నద్ధమయ్యారు. అందులో భాగంగా సోమవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తసున్నారు. ఇందుకు విజయవాడలోని ఇందిరా గాంధీ  మున్సిపల్ స్టేడియం వేదికైంది. ఈ సందర్భంగా వైసీపీ పరిపాలన గురించి వివరిస్తూనే.. ప్రతిపక్ష టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ఘాటుగా వ్యాఖ్యనించారు.

సీఎం జగన్ మట్లాడుతూ..” చంద్రబాబు అవినీతి గురించి తెలుసు కాబట్టే కేంద్ర దర్యాప్తు సంస్థలు నోటీసులు ఇచ్చాయి. చంద్రబాబుపై కక్షపూరితంగా చేసి ఉంటే కేంద్రంలో  అధికారంలో ఉన్న బీజేపీలో సంగం మంది టీడీపీ వాళ్లే ఉన్నారు. స్పష్టమైన ఆధారాలు ఉన్నా చంద్రబాబును అరెస్ట్ చేయొద్దట. పచ్చ గజ దొంగలు చంద్రబాబు అరెస్ట్ ను అన్యాయం అంటున్నాయి. బాబును సమర్థించడం అంటే పేదలను వ్యతిరేకించినట్లే. బాబును సమర్థించడం అంటే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని వ్యతిరేకించడమే. బాబును సమర్థించడం అంటే పేద వర్గాల పిల్లలకు ఇంగ్లీష్ అందకుండా చేయడమే, బాబును సమర్థిచడం పెత్తందారి భావజాలాన్ని సమర్థించడమే.

చంద్రబాబు మనసత్వం ఎలా ఉంటుంది అంటే.. ఎస్సీలో పుట్టాలని ఎవరైన అనుకుంటారా?,బీసీల తోకలు కత్తరిస్తాను అని అనే భావజాలం ఉంటుంది. ఇక పొత్తుల విషయానికి వస్తే… మన ప్రతిపక్షాలని కూడా పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాయి. వాళ్లు ఎంతమంది వచ్చినా కూడా ఏమి లాభం ఉండదు. రెండు సున్నాలు కలిసినా, నాలుగు సున్నాలు కలిసిన వచ్చేది సున్నానే. ప్రజలకు వాళ్లు చేసింది శూన్యం  కాబట్టి వారికి వచ్చేది సున్నా మాత్రమే” అంటూ ప్రతిపక్షాలపై సీఎం జగన్ సెటైర్లు వేశారు. మరి.. చంద్రబాబుపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి