iDreamPost

సర్వే రాయి పాతిన సీఎం జగన్‌ .. చారిత్రక ఘట్టానికి వేదికైన తక్కెళ్లపాడు..

సర్వే రాయి పాతిన సీఎం జగన్‌ .. చారిత్రక ఘట్టానికి వేదికైన తక్కెళ్లపాడు..

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామం చారిత్రక ఘట్టానికి వేదికైంది. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తక్కెళ్లపాడు సర్వే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సర్వే రాయి వేసి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సర్వే జరిగే తీరును సీఎం వైఎస్‌ జగన్‌ పరిశీలించారు. కార్స్‌ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో రోవర్లు, డ్రోన్ల ద్వారా భూ సర్వే చేయనున్నారు. రోవర్, డ్రోన్‌ పరికరాల పనితీరును సీఎం జగన్‌ స్వయంగా పరిశీలించారు.

సమగ్ర సర్వేలో భాగంగా తక్కెళ్లపాడును పైలెట్‌ ప్రాజెక్టుకు ఎంచుకున్న విషయం తెలిసిందే. సర్వే పూర్తి కావడంతో తక్కెళ్లపాడులోని భూ యజమనాలకు వారి భూములపై హక్కు పత్రాలను సీఎం వైఎస్‌ జగన్‌ అందిచారు. సర్వే ఆఫ్‌ ఇండియా ఈ సర్వేకు సాంకేతిక సహాయం అందిస్తోంది. సర్వే రాయి వేసిన తర్వాత సీఎం వైఎస్‌ జగన్‌.. తక్కెళ్లపాడు గ్రామ సచివాలయంలో రిజిస్ట్రేషన్‌ సేవలను ప్రారంభించారు. సమగ్ర భూ సర్వే పూర్తయిన వెంటనే ఆయా గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్‌ సేవలు ప్రారంభం కాబోతున్నాయి. మొదటి దశలో 5 వేలు, రెండో దశలో 6,500, మూడో దశలో 5,500 గ్రామాల్లో సర్వే చేయనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి