iDreamPost

దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం.. జీతం ఎంతో తెలుసా?

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ మేరకు నిన్న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చే ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ తమిళసై. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రెండు ఫైల్స్ పై సంతకాలు చేశారు.

ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఈ మేరకు నిన్న ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చే ప్రమాణ స్వీకారం చేయించారు గవర్నర్ తమిళసై. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రెండు ఫైల్స్ పై సంతకాలు చేశారు.

దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగం.. జీతం ఎంతో తెలుసా?

తెలంగాణలో ఈ నెల 3 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అధికార పార్టీ బీఆర్ఎస్ కన్నా.. అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని నిన్న తెలంగాణలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో రెండవ సీఎంగా ఎనుముల రేవంత్ రెడ్డితో ఎల్బీ స్టేడియంలో గవర్నర్ తమిళసై ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పెద్దలు, వేల సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్కతో పాటు మరికొందరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రేవంత్ రెడ్డి మొదట ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల ఫైలుపై సంతకం చేశారు. ఆ తర్వాత గతంలో తాను హామీ ఇచ్చిన దివ్యాంగురాలు, నిరుద్యోగి అయిన రజినీకి ఉద్యోగం కల్పిస్తూ ఫైలుపై సంతకం చేశారు. దీంతో స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో దద్దరిల్లిపోయింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కొత్తగా అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు.  గతంలో కలిసి కష్టాలు చెప్పుకున్న నిరుద్యోగ దివ్యాంగురాలు(మరుగుజ్జు) రజినీకి ఉద్యోగం ఇస్తూ సంతకాలు చేశారు. అంతేకాదు వేదికపై రజినీకి నియామక పత్రాన్ని కూడా అందజేశారు. రజినీకి అగ్రికల్చర్ కార్పోరేషన్ లో కాంట్రాక్ట్ పద్దతిలో ఉద్యోగం కల్పించారు. రాష్ట్ర సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా పోస్టింగ్ ఇచ్చారు. గతంలో రజినీ ఎంతోమంది అధికారులను కలిసింది. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకుంది. కానీ ఎక్కడ కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. పీజీ పూర్తి చేసిన తనకు ఎక్కడా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది. ఆ సమయంలోనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డిని కలిసింది. ఆమె కష్టాలు చెప్పుకుంది. రజినీ కష్టాలు విన్న రేవంత్ రెడ్డి ఒక్కసారిగా చలించిపోయారు. వెంటనే ఆమెకు త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది.. మొదటి ఉద్యోగం నీకే ఇస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు మీడియా సమక్షంలోనే రజినీకి గ్యారెంటీ కార్డుపై సంతకం చేసి ఇచ్చారు. అన్నట్టుగానే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయ దుంధుబి మోగించింది.. అధికారంలోకి వచ్చింది.

Handicape rajini salary details job given by revanth reddy

ఈ మేరకు రజినీకి ఇచ్చిన హామీని వేల మంది ప్రజల సమక్షంలో నెరవేర్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రజినీ నెలసరి జీతం రూ.50,000 వరకు ఉంటుందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సందర్భంగా రజినీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మహిళలకు ఎన్నో ఉపాధి హామీలు కల్పిస్తామని అన్నారు, మహిళా సంక్షేమం కోసం పాటుపడుతామన్నారు.. త్వరలోనే మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు.ఆడవాళ్ల కోసం ఇన్ని చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి,  సీఎం రేవంత్ రెడ్డి కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు.. జీవితంలో ఉద్యోగం సంపాదిస్తానా అని అనుకున్న నాకు ఇంత పెద్ద ఉద్యోగం ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపింది రజినీ. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి