iDreamPost

CM రేవంత్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆదేశం

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించారు. పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీని వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు.

CM రేవంత్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీసు ఉద్యోగాల భర్తీకి ఆదేశం

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించారు. గత ప్రభుత్వంలో ఉద్యోగాల నియామకాల్లో చోటుచేసుకున్న ప్రతిష్టంభనతో నియామక ప్రకియ ఆగిపోయింది. గ్రూప్ 1 వంటి పరీక్ష పేపర్లు లీక్ అవ్వడంతో నిరుద్యోగుల్లో తీవ్ర నిరాశ చోటుచేసుకుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ చేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర పోలీసు శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పోలీసు నియామకాల ప్రక్రియను వెంటనే చేపట్టాలని అధికారులకు సీఎం సూచించారు.

శుక్రవారం సచివాలయంలో పోలీసు, వైద్యారోగ్య శాఖల్లో నియామకాలపై అధికారులతో సీఎం రేవంత్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా చేపట్టాలని స్పష్టం చేశా రు. తెలంగాణ ఏర్పాటైన నాటి నుంచి ఇప్పటివరకు జరిగిన ఉద్యోగ నియామకాలపై, పెండింగ్ లో ఉన్న ఉద్యోగాల భర్తీ, నోటిఫికేషన్ల వివరాలకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పోలీసు, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ మాదిరిగా ఉత్తర, దక్షిణ తెలంగాణలలో రెసిడెన్షియల్‌ పాఠశాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

అదే విధంగా పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఖాళీగా ఉన్న హోంగార్డుల నియామకాలను వెంటనే చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ రవిగుప్తను ఆదేశించారు. పోలీసు శాఖలో ఏడేళ్లుగా హోంగార్డుల నియామకాలు లేవని, సమర్థవంతమైన పోలీసు సేవల కోసం వెంటనే హోంగార్డుల నియామకాలు చేపట్టాలని డీజీపీని సీఎం ఆదేశించారు. హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ కోసం హోంగార్డుల సేవలను మరింతగా వినియోగించుకోవాలన్నారు. మరి ఉద్యోగ నియామకాలు ప్రక్రియను వెంటనే చేపట్టాలన్న సీఎం రేవంత్ ఆదేశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి