iDreamPost

తెలంగాణ కాంగ్రెస్ పై సీఎం KCR కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 30న ఒకే విడతలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ సభలు నిర్వహిస్తూ ప్రతిపక్ష  కాంగ్రెస్, బీజేపీలపై  ఫైర్ అవుతున్నారు.

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 30న ఒకే విడతలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ సభలు నిర్వహిస్తూ ప్రతిపక్ష  కాంగ్రెస్, బీజేపీలపై  ఫైర్ అవుతున్నారు.

తెలంగాణ కాంగ్రెస్ పై సీఎం KCR కీలక వ్యాఖ్యలు..

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఈ నెల 30న ఒకే విడతలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారంలో బిజీబిజీగా ఉన్నాయి.  సభలు, సమావేశాలు నిర్వహిస్తూ.. ప్రత్యర్థి పార్టీలపై విరుచుకపడుతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్ ప్రచారంలో దూకుడు మీద ఉంది. సీఎం కేసీఆర్ సభలు నిర్వహిస్తూ ప్రతిపక్ష  కాంగ్రెస్, బీజేపీలపై  ఫైర్ అవుతున్నారు. ఏ పార్టీకి ఓటేస్తే లాభమో ప్రజలు ఆలోచించాలని.. ఏమరుపాటుగా ఓటు వేస్తే.. భవిష్యత్‌ ఆగమవుతుందంటూ కేసీఆర్ సూచించారు. దేశంలో 11 సార్లు అవకాశం ఇస్తే కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పాలంటూ కేసీఆర్ ప్రశ్నించారు.

తెలంగాణ నిర్మల్‌, బాల్కొండ, ధర్మపురిలో నిర్వహించిన BRS ఆశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్.. మేనిఫెస్టోను వివరించారు. అంతేకాక పాటు విపక్షాలకు కౌంటర్లు ఇచ్చారు. దేశంలో ఎక్కడాలేని పథకాలను తెలంగాణలో ఉన్నాయని తెలిపారు. రైతుబంధు, బీమా పథకాలు లేవని.. దశలవారీగా రైతుబంధును రూ.16 వేలకు పెంచుతామని కేసీఆర్ తెలిపారు. ధరణి పోర్టల్‌ వచ్చిన తర్వాతే రైతుల సమస్యలు తీరాయని స్పష్టం చేశారు. పెన్షన్‌ను దశల వారీగా రూ.5 వేలకు పెంచుతామని కేసీఆర్ తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌ అంటోందని, 11 సార్లు అవకాశం ఇస్తే ఏం చేసిందో చెప్పాలని గులాబీ బాస్ డిమాండ్ చేశారు. ఇప్పుడు ఏం జరిగిందో ప్రజలు ఆలోచించాలని.. అభివృద్ధి కొనసాగాలంటే బీఆర్ఎస్‌ను మరోసారి గెలిపించాలంటూ ఆయన ప్రజలను కోరారు. మరి.. సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి