iDreamPost

జగనన్న తోడు: లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్‌

జగనన్న తోడు: లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు జమ చేసిన సీఎం జగన్‌

చిరు వ్యాపారులది గొప్ప సేవ అని సీఎం జగన్ ప్రశంసించారు. చిరు వ్యాపారుల కష్టాలను పాదయాత్రలో చూశానన్నారు. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎలాంటి వడ్డీ భారం లేకుండా, లక్షల కుటుంబాలను ఆదుకున్నామని అన్నారు. హస్త కళాకారులు, చిరు వ్యాపారులు, చేతి వృత్తుల వారికి ఏటా రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం అందిస్తున్నామన్నారు. 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా, రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు, గత ఆర్నెల్లకు రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను జమ చేస్తున్నామన్నారు.

స్వయం ఉపాధిని ప్రోత్సహించాల‌న్న‌ది ప్ర‌భుత్వ ఉద్దేశ‌మ‌ని ముఖ్యమంత్రి అన్నారు. అందువ‌ల్లే చిరు వ్యాపారులు తమకు తాము ఉపాధి కల్పించుకోవడమే కాకుండా మిగతా వారికి కూడా ఉపాధి కల్పిస్తున్నారని సీఎం మెచ్చుకున్నారు.

జ‌గ‌న‌న్న తోడుపై ల‌బ్ధిదారులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. లోన్లు తీసుకోవాలంటే బ్యాంకులు చుట్టూ ఇంత‌కుముందు తిరిగేవాళ్లమని, జ‌గ‌న్ ప్ర‌భుత్వంఅధికారంలోకి వచ్చిన తర్వాత, ఒక్కరోజులోనే రుణాలు మంజూరవుతున్నాయని, ఆ ఘనత సీఎం జగన్ దేన‌ని లబ్ధిదారులు అన్నారు. అంత‌కుముందు వచ్చే లాభం అంతా వడ్డీకే సరిపోయేది. జగనన్న తోడుతో వడ్డీ భారం తగ్గిందన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి