iDreamPost

Botsa Satyanarayana: CM జగన్ స్పీచ్..భావోద్వేగానికి గురైన మంత్రి బొత్స!

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంత సిద్ధం' బస్సుయాత్ర మంగళవారం విజయనగరం జిల్లాకు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు.

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన 'మేమంత సిద్ధం' బస్సుయాత్ర మంగళవారం విజయనగరం జిల్లాకు చేరింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగించారు. ఇదే సమయంలో మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు.

Botsa Satyanarayana: CM జగన్ స్పీచ్..భావోద్వేగానికి గురైన మంత్రి బొత్స!

ఏపీలో పోలిటికల్ హీట్ పీక్ స్టేజికి చేరుకుంది. అధికార వైసీసీపీ, ప్రతిపక్ష కూటమి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. ముఖ్యంగా వైఎస్సార్ సీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఎన్నికల సమరంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే మేమంత సిద్ధం పేరుతో బస్సుయాత్ర చేపట్టి రాష్ట్రం మొత్తం చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే మంగళవారం 21వ రోజు విజయనగరంలో జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర సాగింది. ఈ నేపథ్యంలోనే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం ఇచ్చిన స్పీచ్ కి మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాల వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మంగళవారం సీఎం జగన్ మోహన్ రెడ్డి బస్సుయాత్ర విజయనగరం జిల్లాలో సాగింది. ఈ క్రమంలోనే ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్‌ నియోజకవర్గం పరిధిలోని లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులను ప్రజలకు సీఎం జగన్ స్వయంగా పరిచయం చేశారు. ఈ సందర్భంగా విజయనగరం, నెల్లిమర్ల, రాజాం, గజపతినగరం, ఎచ్చెర్ల, బొబ్బిలి నియోజవర్గాలకు నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులను సీఎం జగన్ ప్రజలకు పరిచయం చేశారు. విజయనగరం పార్లమెంట్ పరిధిలోని వైఎస్సార్ సీపీ అభ్యర్థులు కోలగట్ల వీరభద్రస్వామి, శంబంగి వెంకట చిన అప్పలనాయుడు, బడ్డుకొండ అప్పలనాయుడు, తలే రాజేష్​​, బొత్స అప్పలనరసయ్య, గొర్లె కిరణ్‌కుమార్‌లను ప్రజలకు పరిచయం చేసి సౌమ్యులు, పరిపాలనాదక్షులైన వీరిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని సీఎం జగన్ ప్రజలను అభ్యర్థించారు.

అందులో భాగంగానే చీపురపల్లి నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణను సీఎం జగన్ పరిచయం చేశారు. ఆయన తన తండ్రి లాంటి వారని, కానీ అన్న అని పిలుస్తాని బొత్స ను ఉద్దేశిస్తూ సీఎం జగన్ మాట్లాడారు. మంత్రి బొత్సను ప్రత్యేకంగా తనకు తండ్రి సమానులని ప్రజలంతా ఆశీర్వదించాలని కోరినప్పుడు జనం కేరింతలు కొట్టారు. అలా తనను పరిచయం చేస్తుంటే.. ఒకింత మంత్రి బొత్స ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. ఈ దృశ్యం చూసిన ప్రజలు, అభిమానులు కూడా ఉద్వేగానికి లోనయ్యారు. ఈ దృశ్యం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇక బొత్స సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. దివంగత నేత వైఎస్సార్ హాయాంలో కూడా బొత్స సత్యనారాయణ మంత్రిగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు.  ఉమ్మడి విజయనగరం జిల్లాలో పాటు, ఉత్తరాంధ్రాలో బొత్స సత్యనారాయణ కీలకమైన నేత. పార్టీలను పక్కన బెడితే.. ఆయనకంటూ ప్రత్యేక వర్గం ఉంది.  ప్రస్తుతం జగన్ చేపట్టిన బస్సుయాత్రలో విజయనగరం జిల్లాలో అన్నీ తానై చూసుకుంటున్నారు బొత్స సత్యనారాయణ.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి