iDreamPost

రాజకీయం అంటే ఏమిటో షర్మిలకు చూపించిన సీఎం జగన్?

YS Jagan, Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పీసీసీ బాధ్యతలు చేపట్టగానే ఎమ్మెల్యే ఆర్కేను చేర్చుకోవడంతో తన అన్న సీఎం జగన్ కి రాజకీయం అంటే ఏమిటో చూపించానని భావించారు. అయితే తాజాగా రాజకీయం అంటే ఏమిటో షర్మిలకు సీఎం జగన్ చూపించారనే టాక్ వినిపిస్తోంది.

YS Jagan, Sharmila: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పీసీసీ బాధ్యతలు చేపట్టగానే ఎమ్మెల్యే ఆర్కేను చేర్చుకోవడంతో తన అన్న సీఎం జగన్ కి రాజకీయం అంటే ఏమిటో చూపించానని భావించారు. అయితే తాజాగా రాజకీయం అంటే ఏమిటో షర్మిలకు సీఎం జగన్ చూపించారనే టాక్ వినిపిస్తోంది.

రాజకీయం అంటే ఏమిటో షర్మిలకు చూపించిన సీఎం జగన్?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. వేసవి కాలం రాక ముందే.. ఆస్థాయిలో పొలిటికల్ హీట్ ఏపీలో కనిపిస్తోంది. ముఖ్యంగా మంగళవారం ఏపీ పాలిటిక్స్ లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి తన సొంతగూడికి చేరుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి వెళ్లారు. రెండు నెలల క్రితమే ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల సమక్షంలో కాంగ్రెస్ కడువా కప్పుకున్నారు. అయితే ఇంతాలోనే ఇలా తిరిగి తన సొంతగూటికి రావడంపై పొటికల్ సర్కిల్ లో అనేక వార్తలు వినిపిస్తోన్నాయి. రాజకీయం అంటే ఏమిటో షర్మిలకు సీఎం జగన్ చూపించారని రాజకీయ విశ్లేషకలు  అభిప్రాయా పడుతున్నారు.

రాజకీయం అనేది సొంత కుటుంబ సభ్యుల మధ్యనే వైరం పెడుతుంది. రక్త సంబంధికులనే శత్రువులుగా మారుస్తుంది. ఇలాంటి ఘటనలు రాజకీయాల్లో అనేక జరిగాయి. ఇటీవలే ఏపీలోనూ అలాంటి తరహ ఘటన ఒకటి చోటుచేసుకుంది. కాంగ్రెస్  చేసిన కుట్రకు వైఎస్సార్ కుటుంబంలో రెండు చీలిక వచ్చాయి. వైఎస్సార్ తన షర్మిల, అన్నకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి.. ఆయనపైనే ఆరోపణలు చేస్తుంది. అందుకోసమే ఆమెను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆ పార్టీ అధినాయకత్వం నియమించింది. ఇక్కడ తమ గెలుపు కంటే.. సీఎం జగన్ ను రాజకీయంగా ఇబ్బందులకు గురి చేయాలనే కుట్ర ఎక్కువగా కనిపిస్తోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు.

ఏపీ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తరువాత షర్మిల..రాజకీయం అంటే ఏమిటో తన అన్నకు చూపిస్తానన్నట్లు వ్యవహరించింది. ఆమె బాధ్యతలు స్వీకరించిన తరువాత వైఎస్సార్ సీపీ నుంచి ఆళ్ల రామకృష్ణ రెడ్డి వెళ్లారు. దీంతో షర్మిల.. సీఎం జగన్ కి రాజకీయం చూపించానని భావించింది. అయితే సరిగ్గా రెండు నెలల తరువాత ఆర్కే తిరిగి సొంతగూటికి వచ్చారు. దీంతో చెల్లికి అన్న..తన రాజకీయం అంటే ఏమిటో చూపించారని, అదే షర్మిళకు జగన్ ఇచ్చే గిఫ్ట్ అనే టాక్ వినిపిస్తోంది. నీ దగ్గరకు వచ్చేవారు తాత్కాలికమే తప్పా, శాశ్వతం కాదని పరోక్షంగా షర్మిలకు సీఎం జగన్ ఆర్కే వ్యవహరంతో సంకేతాలు పంపారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

డిసెంబర్ 11న ఎమ్మెల్యే ఆర్కే.. షర్మిల సమక్షంలో పార్టీలో చేరారు. ఈ రెండు నెలల సమయంలో షర్మిల రాజకీయ యాక్టీవ్ లను  పూర్తిగా తెలుసుకున్నారు. కాంగ్రెస్ లో ఆమె చేస్తున్న రాజకీయం నచ్చకనే ఆర్కే వెనక్కి వచ్చేశారని టాక్ వినిపిస్తోంది. కాంగ్రెస్ కోసం కంటే.. టీడీపీ  బీ టీమ్ గా, జగన్ ఓట్లను చీల్చేందుకు పని చేస్తుందని గ్రహించి.. ఆర్కే వెనక్కి వచ్చారనే ప్రచారం సాగుతోంది. ఇక ఆర్కే వైసీపీ వీడినప్పుడు సీఎం జగన్ ద్వేషించడం కానీ పార్టీని ద్వేషించడం ఏం చేయలేదు. కూల్ గా అటు వెళ్లి తిరిగి తనసొంత గూటికి వచ్చేశారు. ఇలా ఆర్కే షర్మిలకు గట్టి షాక్ ఇచ్చారని పొలిటికల్ ఎనలిస్ట్ లు అభిప్రాయ పడుతున్నారు. ఇలా రాజకీయం అంటే ఏమిటో షర్మిలకు సీఎం జగన్  చూపించారనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి