iDreamPost

విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం జగన్

సీఎం జగన్ రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నేరుగా వెళ్లి పరామర్శించారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. బాధితులు అదైర్యపడొద్దని అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

సీఎం జగన్ రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నేరుగా వెళ్లి పరామర్శించారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. బాధితులు అదైర్యపడొద్దని అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించిన సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో తీవ్ర విశాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందగా 50 మందికి పైగా గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రైల్వే అధికారులతో కలిసి యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది. రైలు ప్రమాదం జరిగిన ప్రాంతమంతా క్షతగాత్రుల ఆర్తనాదాలతో మారుమోగింది. ఇదిలా ఉంటే ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ఘటనపై స్పందించి మ‌ృతులకు, గాయపడిన వారికి పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

సీఎం జగన్ రైలు ప్రమాదంలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను నేరుగా వెళ్లి పరామర్శించారు. క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను పరామర్శించి ఓదార్చారు. బాధితులు అదైర్యపడొద్దని అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. ఆ తరువాత అధికారుల నుంచి ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద ఘటనకు సంబంధించిన ఫొటోలను పరిశీలించారు సీఎం జగన్.

కాగా విజయనగరం జిల్లాలోని కంటకాపల్లి వద్ద నిన్న (ఆదివారం) రాత్రి సుమారు 7 గంటల సమయంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్టణం నుండి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు కొత్తవలస మండలం కంటకాపల్లి వద్ద సిగ్నల్ కోసం ఆగి ఉంది. అయితే అదే సమయంలో ఈ రైలు వెనుకే వస్తున్న విశాఖపట్టణం-రాయగడ రైలు ప్యాసింజర్ రైలును ఢీకొట్టింది. ఆ తరువాత పక్క ట్రాక్ లో ఉన్న గూడ్స్ పైకి బోగీలు దూసుకెళ్లాయి. దీంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. కాగా సహాయక చర్యలు, ట్రాక్ పునరుద్దరణ పనులు వేగంగా జరుగుతున్నాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి