iDreamPost

వలసకూలీల అంశంలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన జగన్

వలసకూలీల అంశంలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిన జగన్

లాక్ డౌన్ నెపధ్యంలో ప్రయాణాలు, రోజువారి కూలి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో పనుల కోసం దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాల నుండి వలస వచ్చిన కూలీల పరిస్తితి దుర్భరంగా మారింది. ఈ నెపధ్యంలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చి రాష్ట్రంలో చిక్కుకుపోయిన కూలీలకు భోజన వసతులు కల్పించే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కి ఇతర రాష్ట్రాల నుండి ప్రశంసలు దక్కుతున్నాయి.

వలస కూలీల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 393 సహాయక శిబిరాలు ఏర్పాటు చేసి 21,025 మందికి వసతి కల్పించింది. ఇందులో రాష్ట్రానికి చెందినవారు 12,820 మంది కాగా ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 8,200 మంది వరకూ ఉన్నారు. ముఖ్యమంత్రి ఈ సహాయక శిబిరాల పై ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతున్నాడు. జగన్ ప్రత్యేక చొరవ తీసుకుని కూలీలకు వసతులు కల్పించే విషయంలో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించడంతో ఖర్చు విషయంలో ఎలాంటి రాజీ పడకుండా శిబిరాల లొని వారికి పౌష్టికాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందిస్తున్నారు. ఈ శిబిరాల్లో భౌతిక దూరం పాటించేలా పడకలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు అల్పాహారం, భోజనం ఉడకపెట్టిన కోడి గుడ్లు అందిస్తున్నారు.

ఈ శిబిరాలలొ మొత్తం 23 రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఉన్నారు. ఇందులో అత్యధికంగా మహరాష్ట్ర నుండి 1,334 మంది తమిళనాడు నుండి 1,198 మంది జర్ఖాండ్ నుండి 895 మంది బిహార్ నుండి 735 మంది ఉన్నారు. తమ రాష్ట్రం వారికి వసతులు కల్పించే విషయంలో సంతోషం వ్యక్తం చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనీస్వామి ఇప్పటికే ట్విట్టర్ ద్వారా జగన్ ని అభినందించిన సంగతి తెలిసిందే. కేవలం ప్రభుత్వమే కాక 95 ఎన్జీవో సంస్థలు కుడా ప్రభుత్వంతో కలసి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాయి.

కాగ, శిబిరాల్లొ ఉన్నవారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వారికి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వసతి ఏర్పాట్లు.. భోజన సదుపాయాల పట్ల శిబిరాల్లొ ఉన్నవారంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ కష్ట కాలంలో మానవతా దృక్పధంతో తమను ఆదుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి, జగన్ మోహన్ రెడ్డి కి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు వలస కూలీలు ప్రత్యేకంగా కృతఙ్ఞతలుతెలుపుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి