iDreamPost

శారదా పీఠంలో వైఎస్‌ జగన్

శారదా పీఠంలో  వైఎస్‌ జగన్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖలోని శారదా పీఠానికి వచ్చారు..అక్కడ జరుగుతున్న రాజ శ్యామల యాగానికి హాజరయ్యారు. సోమవారం పీఠానికి వచ్చిన ముఖ్యమంత్రికి అధికారులు,నాయకులు, పీఠం నిర్వహక్కులు ఘన స్వాగతం పలికారు .
అనంతరం పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలు ముఖ్యమంత్రిని ఆశీర్వదించారు. తరువాత పీఠం ప్రాంగణంలోని రాజశ్యామల అమ్మవారికి ముఖ్యమంత్రి ప్రత్యేక పూజలు చేశారు. పీఠాధిపతులతో కలిసి జమ్మిచెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన సీఎం వైఎస్ జగన్.. గోమాతకు నైవేద్యం సమర్పించారు.

పీఠంలో నూతనంగా నిర్మించిన స్వయం జ్యోతి మండపం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. యాగశాలలో ఐదు రోజులుగా టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీనివాస చతుర్వేద హవనం పూర్ణాహుతిలో సీఎం వైఎస్ జగన్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, స్థానిక నాయకులు ఉన్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి