iDreamPost

మృణాల్ డేటింగ్ వార్తలపై క్లారిటీ! కాస్త గట్టిగానే ఇచ్చారు!

నటీనటులు ఎక్కడ కనిపించినా కెమెరా కళ్లు క్లిక్ క్లిక్ మనిపిస్తాయి. వారి చేసే ప్రతి పనిపై ఫోకస్ పెంచేస్తుంటాయి. కళ్లు ఎగరేసినా, కాలు జారి పడిపోయినా.. సెన్సేషనల్ బజ్ క్రియేట్ చేస్తుంటాయి. మరీ ఓ నటి.. ఎవరితోనైనా కనిపిస్తే.. ఇక ఊరుకుంటాయా..?

నటీనటులు ఎక్కడ కనిపించినా కెమెరా కళ్లు క్లిక్ క్లిక్ మనిపిస్తాయి. వారి చేసే ప్రతి పనిపై ఫోకస్ పెంచేస్తుంటాయి. కళ్లు ఎగరేసినా, కాలు జారి పడిపోయినా.. సెన్సేషనల్ బజ్ క్రియేట్ చేస్తుంటాయి. మరీ ఓ నటి.. ఎవరితోనైనా కనిపిస్తే.. ఇక ఊరుకుంటాయా..?

మృణాల్ డేటింగ్ వార్తలపై క్లారిటీ! కాస్త గట్టిగానే ఇచ్చారు!

సినీ తారలు ఎక్కడ ఏ చిన్న సందడి చేసినా.. వారి గురించి పుకార్లు పుట్టుకొస్తూనే ఉంటాయి. సాధారణంగా నటీనటులు అటువంటి పుకార్లను పట్టించుకోరు . కానీ, అవి వారి మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉంటే మాత్రం కచ్చితంగా స్పందిస్తారు. ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. తాజాగా సినీ నటి మృణాల్ ఠాకూర్ విషయంలో కూడా ఇదే జరిగింది. గత కొన్ని రోజులుగా.. మృణాల్ బాలీవుడ్ ర్యాపర్ బాద్షా తో డేటింగ్ లో ఉందంటూ ఓ పుకారు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది. అయితే.. ఈ విషయంపై బాలీవుడ్ ర్యాపర్ బాద్షా ఇప్పుడు స్పందించాడు.

మృణాల్ ఠాకూర్.. అచ్చమైన తెలుగు అమ్మాయిలా సీతారామం సినిమాతో అందరి మెప్పును పొందింది. రానున్న “హాయ్ నాన్న” మూవీ తో సరికొత్త పాత్రతో మరోసారి తెలుగు ప్రజలను ఆకట్టుకోనుంది . అయితే.., ఈ మధ్య సోషల్ మీడియాలో ఈ అమ్మడు ఎక్కువగా ట్రోలింగ్ కు గురి అవుతోంది. మృణాల్.. గతంలో ఓ టాలీవుడ్ హీరో ను పెళ్లాడబోతుంది అనే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరోసారి మృణాల్ డేటింగ్ లో ఉందంటూ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. అయితే.. దీనికి కారణం లేకపోలేదు.ఇటీవల ముంబై లో శిల్పాశెట్టి దీవాలి బాష్ ప్రోగ్రాం ఘనంగా జరిగింది. ఈ ప్రోగ్రాంలో ప్రముఖ నటీనటులు అందరు సందడి చేశారు.

ఆ పార్టీ కి హాజరైన మృణాల్ ఠాకూర్ ప్రముఖ బాలీవుడ్ ర్యాపర్ బాద్షా చేయి పట్టుకుని నడించింది. తరువాత ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ అయింది. దీనితో వీరు ఇద్దరు డేటింగ్ లో ఉన్నారా ! అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపించారు. ఇక తమపై వస్తున్న రూమర్స్ పైన ర్యాపర్ బాద్షా స్పందించాడు. “మిమ్మల్ని నిరాశపరచినందుకు క్షమించండి. మీరు అనుకున్నట్లు అలాంటిది ఏమి లేదు” అంటూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీ లో పోస్ట్ చేశాడు. మృణాల్ తో కలిపి తనపై వచ్చిన రూమర్స్ కారణంగానే బాద్షా ఆ స్టోరీ పెట్టారంటూ అంతా కామెంట్స్ చేస్తుండటం విశేషం.

ఇక ఈ అమ్మడు ఇటీవల ఇషాన్ కట్టర్ తో కలిసి యుద్ధ నేపథ్యంలో తెరకెక్కిన “పిప్పా” మూవీ లో తన పాత్రను అద్భుతంగా పోషించింది. బ్రిగేడియర్ బలరాం సింగ్ రచించిన “ది బర్నింగ్ ఛాఫీస్ ” పుస్తకం ఆధారంగా రాజా కృష్ణ మీనన్ ఈ చిత్రాన్ని రూపొందించారు . నవంబర్ 10 న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ మూవీ కి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. ఇక మరిన్ని మూవీస్ తో ఈ అమ్మడు తెలుగు ప్రజలను ఆకట్టుకొనుంది. ఏదేమైనా.. ఇలా ఓ వ్యక్తితో కలిసి నడిచినంత మాత్రాన.. మృణాల్ పై ఇలాంటి పుకార్లు పుట్టుకురావడం విచారించతగ్గ విషయం. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి