iDreamPost

తిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ కు చిరు షాక్..

తిరుపతి ఉప ఎన్నికల్లో పవన్ కు చిరు షాక్..

తిరుపతి ఉప ఎన్నిక ముందు పవన్ కు అనుకోని షాక్ తగిలింది. ఓ వైపు తిరుపతి ఉప ఎన్నిక ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై ఒంటికాలుపై లేచి నించుంటున్నారు. అయితే ఇలాంటి సమయంలో మెగాస్టార్ చిరంజీవి తమ్ముడికి అనుకోని షాక్ ఇచ్చారు. ఏపీ సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఓ వైపు ఉప ఎన్నిక ముందు జగన్ ను పవన్ తిడుతుంటే.. అందే సమయంలో అన్న చిరంజీవి పొగితే ఎలా అని అభిమానులు తలలు పట్టుకుంటున్నారు..

తాజాగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ అనుబంధ వ్యవస్థలకు రాయితీలు ప్రకటించారు సీఎం జగన్. దీంతో సీఎం జగన్ కు మెగాస్టార్ చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్ విలయతాండవం చేస్తున్న సమయంలో జగన్ చిత్ర పరిశ్రమకు లబ్ది చేకూర్చేలా ఇలాంటి చర్యలు ప్రకటించారని చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి రాయితీలతో సినీ రంగం ముందుకు వెళ్లడానికి అవకాశం ఉంటుంది అన్నారు. సీఎం జగన్ ఎంతో ఉదారంగా ప్రకటించిన ఈ రాయితీల వల్ల ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్న వేలాది కుటుంబాలు త్వరగా కోలుకుంటాయి అంటూ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రస్తుతంతెలుగు ఇండస్ట్రీలో కరోనాతో దారుణమైన పరిస్థితుల్లో ఉంది. ఈ మధ్య కాస్త కోలుకుంటున్నట్లు అనిపిస్తున్నా.. మళ్లీ తాజా పరిస్థితి ఆందోళన పెంచుతోంది. రోజు రోజుకూ తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సెకెండ్ వేవ్ ఇంకాస్త భయం పెంచుతోంది. దీంతో మళ్లీ ఎక్కడ లాక్‌డౌన్ విధించాల్సి వస్తుందో.. లేదంటే ఎక్కడ మళ్లీ థియేటర్స్‌లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీ చేస్తారో అని కంగారు పడుతున్నారు నిర్మాతలు, సినిమా పెద్దలు. చాలా సినిమాలు.. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు ఇప్పటికే విడుదల తేదీలు కన్ఫర్మ్ చేసుకున్నాయి.

పవన్ కు చిరు షాక్ మీద షాక్..

కొద్దిరోజులుగా మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు పవన్ కల్యాణ్ కు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో పవన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బీజేపీ స్టీల్ ప్లాంట్ ను ప్రయివేటీకరణ చేసున్నామని చెప్పినా ఆయన నోరు మెదపకుండా ఉన్నారు. దీంతో మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో ఘోరపరాభవం చవిచూసింది. చిరంజీవి మాత్రం దీనిపై స్పందించారు. బీజేపీపై విమర్శలు చేశారు. తర్వాత ఓర్వకల్లు విమానాశ్రయంకు స్వాతంత్ర్య పోరాట యోధుడు నరసింహారెడ్డి పేరు జగన్ పెట్టడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. జగన్ కు కృతజ్ఞత తెలిపారు. ఇప్పుడు కరోనా కష్టాల్లో ఉన్న సినీ ఇండస్ట్రీని కాపాడేందుకు రాయితీలు ఇవ్వడంపై చిరు కృతఙ్ఞతలు తెలిపారు. దీనిపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంచి ఎవరు చేసిన దానిని స్వాగతించాలని అంతేగాని విమర్శించడమే పనిగా పెట్టుకోకూడదు అని హితవు పలుకుతున్నారు.

Also Read : కరోనాపై జగన్ చెప్పింది.. అక్షర సత్యం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి