iDreamPost

గాడ్ ఫాదర్ OTT – డేట్ ఫిక్స్

గాడ్ ఫాదర్ OTT – డేట్ ఫిక్స్

మొదటి అయిదు రోజులు విపరీతమైన హడావిడితో మంచి రివ్యూలు టాక్ తో పాటు వసూళ్లను సొంతం చేసుకున్న గాడ్ ఫాదర్ అనూహ్యంగా ఆ తర్వాతి రోజు నుంచి దభాలున పడిపోయి చివరికి లాస్ వెంచర్ గా మిగిలిపోయింది. ఆచార్య అంత దారుణంగా పెర్ఫార్మ్ చేయకపోవడం మెగా ఫ్యాన్స్ కి ఊరట కలిగించినా ఏదో ఖైదీ నెంబర్ 150 రేంజ్ లో ఆడుతుందనుకున్న ఆశలు మాత్రం ఆవిరయ్యాయి. నిజానికి ఇంత డౌన్ ఫాల్ ఎవరూ ఊహించలేదు. ఫస్ట్ వీక్ ఎక్కడా నెగటివ్ ఫీడ్ బ్యాక్ లేకపోయినా చిరంజీవి రేంజ్ పెద్ద హీరోకి ఇలా జరగడం అరుదు. దీని ప్రభావం ఎంతో కొంత వాల్తేర్ వీరయ్య మీద పడుతున్నా బిజినెస్ అయితే బాగానే జరుగుతోంది.

ఇక ఫ్యాన్స్ అండ్ మూవీ లవర్స్ ఎదురు చూస్తున్న గాడ్ ఫాదర్ ఓటిటి డేట్ వచ్చేసింది. నవంబర్ 19 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అంటే సరిగ్గా నలభై అయిదు రోజులకు. మెగా మూవీతో పాటే థియేటర్లలో రిలీజైన నాగార్జున ది ఘోస్ట్ 23 రోజులకు, బెల్లంకొండ గణేష్ స్వాతిముత్యం 20 రోజులకే డిజిటల్ బాట పట్టాయి. అలా చూసుకుంటే గ్యాప్ కోణంలో గాడ్ ఫాదర్ బెటరే కానీ ఇంకా త్వరగా వస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మలయాళం లూసిఫర్ రీమేక్ గా రూపొందిన ఈ సినిమాలో సత్యదేవ్ సూపర్ విలనీ, నయనతార సిస్టర్ సెంటిమెంట్, సల్మాన్ ఖాన్ స్పెషల్ క్యామియో, తమన్ బీజీఎమ్ ఇవేవి లాంగ్ రన్ ఇవ్వలేకపోయాయి.

మొత్తానికి ఈ ఏడాది బాక్సాఫీస్ పరిణామాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఇదేం ఆడుతుందిలే అనుకున్న కాంతార తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా యాభై కోట్ల గ్రాస్ దాటేసి వామ్మో అనిపించింది. గాడ్ ఫాదర్ ఏడో రోజే కలెక్షన్లు తగ్గి విలవిలలాడితే దీనికి మాత్రం మూడో వారంలోనూ హౌస్ ఫుల్స్ పడ్డాయి. కంటెంట్ బలం అలాంటిది మరి. నెట్ ఫ్లిక్స్ మెగాస్టార్ రెండు సినిమాలు కొన్న సంగతి తెలిసిందే. గాడ్ ఫాదర్ ని 57 కోట్లకు, వాల్తేర్ వీరయ్యను 50 కోట్లకు డీల్ చేసుకుంది. మొదటిది హిందీ వెర్షన్ కూడా ఉంది కాబట్టి కాస్త ఎక్కువ రేట్ దక్కింది. కాకపోతే థియేటర్ కు డిజిటల్ కు మధ్య కనీసం నెలన్నర గ్యాప్ ఉండేలా నిర్మాతలు అగ్రిమెంట్ చేసుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి