iDreamPost

మెగా మద్దతుతో లాల్ సింగ్ – ప్రాఫిట్టేనా

మెగా మద్దతుతో లాల్ సింగ్ – ప్రాఫిట్టేనా

తొందరపడి ఒక కోయిల ముందే కూసింది తరహాలో ట్రైలర్ ని సినిమా రిలీజ్ డేట్ కు నెలల ముందే విడుదల చేసిన లాల్ సింగ్ చడ్డా టీమ్ ఇప్పుడు దీనికి తగినంత బజ్ తెచ్చేందుకు నానా తంటాలు పడుతోంది. ఎన్నడూ లేనిది అమీర్ ఖాన్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చి చిరంజీవి ఇంట్లో ప్రీమియర్ వేసి రాజమౌళి, సుకుమార్, నాగార్జునలతో కలిసి మూవీ చూడటం, దాని తాలూకు వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం కొత్తగా అనిపిస్తోంది. ఇదంతా దక్షిణాదిలో బజ్ తేవడంలో భాగమని వేరే చెప్పాలా. వందల కోట్ల థియేట్రికల్ బిజినెస్ తో బరిలో దిగుతున్న లాల్ సింగ్ కు అన్ని భాషలు కీలకమే


ఇదంతా ఒక ఎత్తు అయితే తెలుగు వెర్షన్ కు చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించడం అభిమానులను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఎందుకంటే మెగాస్టార్ గతంలో తనకు సంబంధం లేని వాటికి ఇలా ప్రెజెంటెడ్ బై అని ఎప్పుడూ వేసుకోలేదు. ఇదే మొదటిసారి. అందులోనూ బాలీవుడ్ డబ్బింగ్ మూవీకి. అప్పుడెప్పుడో సైరా టైంలో టోక్యో ఎయిర్ పోర్ట్ లో అమీర్ కలిసినప్పుడు జరిగిన చర్చ వల్ల ఇందులో భాగమయ్యానని చిరు చెబుతున్నారు కానీ నిజానికి ఆయన ప్రత్యక్షంగా ఇందులో పెట్టుబడి పెట్టారా అంటే డౌటే. కేవలం మెగా బ్రాండ్ ని వాడుకుని సినిమాను మార్కెటింగ్ చేసే ఉద్దేశంతో నిర్మాతలు ఇలా ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది

ఇప్పుడీ పరిణామం వల్ల లాల్ సింగ్ కు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ దక్కుతుందని చెప్పలేం. నాగ చైతన్య స్పెషల్ రోల్ చేశాడు కాబట్టి ఎలాగూ అక్కినేని అభిమానులు అండగా ఉంటారు కానీ అసలు సినిమా ఏ మాత్రం మేజిక్ చేస్తుందో వేచి చూడాలి. 3 ఇడియట్స్ రేంజ్ లో టాక్ వస్తే లాల్ సింగ్ కలెక్షన్లకు ఢోకా లేదు. యావరేజ్ అన్నా కష్టమే. అసలే హై ఎమోషన్స్ తో రూపొందిన ఫారెస్ట్ గంప్ రీమేక్ ఇది. ఏ మాత్రం అటుఇటు అయినా అమీర్ ఇన్నేళ్ల కష్టం వృథా అవుతుంది. మరి మెగా సపోర్ట్ ఏ మేరకు ఉపయోగపడుతుందో చూడాలి. కరీనా కపూర్ హీరోయిన్ గా నటించిన లాల్ సింగ్ చడ్డాకు అద్వైత్ చందన్ దర్శకుడు కాగా ప్రీతమ్ తనూజ్ లు సంగీతమందించారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి