iDreamPost

వీడియో: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

  • Published Dec 26, 2023 | 8:21 AMUpdated Dec 26, 2023 | 10:11 AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. సీఎం రేవంత్ ని కలిశారు. ఆ వివరాలు..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో.. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిరంజీవి.. సీఎం రేవంత్ ని కలిశారు. ఆ వివరాలు..

  • Published Dec 26, 2023 | 8:21 AMUpdated Dec 26, 2023 | 10:11 AM
వీడియో: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మెగాస్టార్ చిరంజీవి

ఈ ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. దాంతో రేవంత్ రెడ్డి.. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. సీఎం పదవి చేపట్టిన నాటి నుంచి పాలనలో దూకుడుగా ముందుకు సాగుతున్నారు రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం చర్యలు వేగవంతం చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని తెలిపారు. అలానే రాష్ట్రంలో డ్రగ్స్ ని సమూలంగా నిర్మూలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి రేవంత్  రెడ్డి. ఈ క్రమంలో తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని..  సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించన వీడియో నెట్టింట వైరలవుతోంది.

రేవంత్ రెడ్డి.. తెలంగాణ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. తొలిసారి ఆయన్ని కలిశారు మెగాస్టార్ చిరంజీవి. నూతన ముఖ్యమంత్రికి అభినందనలు తెలిపారు. ఆతర్వాత రేవంత్ రెడ్డితో కాసేపు  మాట్లాడారు. రేవంత్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి కేవలం మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో.. ఆయనని కలిసి సినిమా పరిశ్రమ గురించి మాట్లాడేందుకు సినీ పెద్దలు ఎదురు చూస్తున్నారు.

ఈ క్రమంలో సోమవారం నాడు టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. కొన్ని రోజుల క్రితమే.. తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కలిశాము. ఇక త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్‌మెంట్ తీసుకుని ఆయనతో మీటింగ్‌కు ఏర్పాట్లు చేస్తామని చెప్పారని వెల్లడించాడు దిల్ రాజు. అయితే, మిగతా వారి కన్నా ముందుగానే సీఎం రేవంత్ రెడ్డిని.. మెగాస్టార్ చిరంజీవి కలవడం విశేషం.

గతంలో తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. చలనచిత్ర పరిశ్రమకు మంచి  ప్రోత్సాహం అందించింది. గత ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇండస్ట్రీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది కాబట్టి.. ఈ ప్రభుత్వం నుంచి కూడా సినీ ఇండస్ట్రీకి ప్రోత్సాహం అవసరం. అందుకే పరిశ్రమ వర్గాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఇండస్ట్రీకి ప్రోత్సాహం అందించాలని విన్నవించాలని భావిస్తున్నారు. దానిలో భాగంగానే త్వరలోనే టాలీవుడ్ నిర్మాతలు.. ముఖ్యమంత్రి రేవంత్ ని కలవనున్నారు.

ఇదిలా ఉంటే, మెగాస్టార్ చిరంజీవి విషయానికి వస్తే..  ప్రస్తుతం ఆయన సినిమాలకు కొన్నాళ్లు బ్రేక్ ఇచ్చి.. రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత చిరు.. వశిష్ఠ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇది మెగాస్టార్ 156వ సినిమా కానుంది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌‌పై వంశీ, ప్రమోద్, విక్రమ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు ‘విశ్వంభర’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే దీని గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ సినిమా షూటింగ్ జనవరి మూడో వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి