iDreamPost

హనుమాన్‌ సినిమాలో చిరంజీవి.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘హనుమాన్‌’ సినిమాలో చిరంజీవి ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రచారంపై తాజాగా దర్శకుడు స్పందించాడు.

ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘హనుమాన్‌’ సినిమాలో చిరంజీవి ఉన్నాడంటూ గత కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రచారంపై తాజాగా దర్శకుడు స్పందించాడు.

హనుమాన్‌ సినిమాలో చిరంజీవి.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు!

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్‌ వర్మ. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తన మార్కును చూపిస్తూ ఉన్నారు. సినిమాకు సినిమాకు మధ్య కథలో, కథనంలో వ్యత్యాసం ఉండేలా చూసుకుంటూ ఉన్నారు. ప్రయోగాలకు పెద్ద పీట వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ‘హనుమాన్‌’ అనే ఓ సూపర్‌ హీరో సినిమా తెరకెక్కించారు. ఈ మూవీ జనవరి నెలలో విడుదల కానుంది. సంక్రాంతికి ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్‌ అవ్వనుంది.

తెలుగుతో పాటు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల అవ్వనుంది. గత కొన్ని నెలల నుంచి ఓ వార్త సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. హనుమాన్‌ సినిమాలో చిరంజీవి ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. చిరంజీవి హనుమంతుడిగా కనిపించనున్నాడన్న టాక్‌ నడుస్తోంది. ఈ ప్రచారంపై తాజాగా చిత్ర దర్శకుడు ప్రశాంత్‌ వర్మ స్పందించారు. హనుమంతుడి పాత్రలో చిరంజీవి అన్న దానిపై క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో యాంకర్‌కు ప్రశాంత్‌ నీల్‌కు మధ్య సంభాషణ ఈ విధంగా జరిగింది.

యాంకర్‌ : మీరు ట్రైలర్‌ చివర్లో హనుమంతుడి చూపించారు. ఆ కళ్లు కావాలని పెట్టారా?.
ప్రశాంత్‌ వర్మ : కావాలని అంటే అర్థం కాలేదు సార్‌?.
యాంకర్‌ : హనుమంతుడి క్యారెక్టర్‌ ఎవరు వేస్తున్నారని మీరు చెప్పలేదు. రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. అలాంటి వాటిలో సముద్రఖని గారి పేరు ఒకటి..
ప్రశాంత్‌ వర్మ : సముద్ర ఖని గారు ప్లే చేస్తుంది డిఫరెంట్‌ రోల్‌. ఆయన ఆల్‌రెడీ స్వామీజీ లాంటి గెటప్‌లో ఉన్నారు కదా.. అది వేరు.. ఇది వేరు..
యాంకర్‌ : కళ్లు చూడగానే చాలా మంది పోల్చుకున్నది ఏంటంటే.. చిరంజీవి గారివి అని.
ప్రశాంత్‌ వర్మ : అవును సార్‌!!
యాంకర్‌ : అది మీరు కావాలని పెట్టారా?
ప్రశాంత్‌ వర్మ : అది కొంచె సస్పెన్స్‌ సార్‌.. థియేటర్‌లో చూస్తే బాగుంటుంది.
యాంకర్‌ : కొంప తీసి చిరంజీవి గారు ప్లే చేశారా ఏంటి?
ప్రశాంత్‌ వర్మ : లేదు,లేదు మీరు కొంచెం సస్పెన్స్‌.
యాంకర్‌ : చిరంజీవి గారు ఆంజనేయ భక్తుడు.
ప్రశాంత్‌ వర్మ : అవును, అవును. సినిమాలో హనుమంతుడ్ని ఎలా చూపించాలి అనేది 2 సంవత్సరాల చర్చ. ఎలా చూపించాలి అని. ప్రేక్షకులు దాన్ని తెర మీదే చూడాలి. అందుకే ఏమీ చెప్పట్లేదు.
యాంకర్‌ : చిరంజీవి గారినే .. గ్రాఫిక్స్‌ చిరంజీవి గారిగా చూపించారంటే..
ప్రశాంత్‌ వర్మ : ఈ ఇంటర్వ్యూలోనే కాదు.. ఏ ఇంటర్వ్యూలోనూ చెప్పను.
యాంకర్‌ : కళ్లు మటుకు చిరంజీవి గారివే.. అనిపించింది మాకు..
ప్రశాంత్‌ వర్మ : రైట్‌ సార్‌..

మొత్తానికి సినిమాలో చిరంజీవి హనుమంతుడి క్యారెక్టర్‌లో దర్శనమివ్వనున్నారని చెప్పకనే చెప్పారు. మరి, హనుమాన్‌ సినిమాలో చిరంజీవి పాత్రపై ప్రశాంత్‌ వర్మ క్లారిటీ ఇవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి