iDreamPost

భారీగా పెరిగిన చికెన్ ధరలు! కిలో రూ.400 ఏందిరా బాబు!

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే చాలా ఇష్టం. సండే, మండేతో సంబంధం లేదు ఎప్పుడు తినాలపిస్తే అప్పుడే వండుకోవడమో, లేదా ఆర్డర్ చేసుకునో తింటుంటారు. అలాంటి వారికి బ్యాడ్ న్యూస్. చికెన్ ధరలు పెరిగాయి.

నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే చాలా ఇష్టం. సండే, మండేతో సంబంధం లేదు ఎప్పుడు తినాలపిస్తే అప్పుడే వండుకోవడమో, లేదా ఆర్డర్ చేసుకునో తింటుంటారు. అలాంటి వారికి బ్యాడ్ న్యూస్. చికెన్ ధరలు పెరిగాయి.

భారీగా పెరిగిన చికెన్ ధరలు!  కిలో రూ.400 ఏందిరా బాబు!

నాన్ వెజ్ ప్రియులకు ముక్కలేనిదే ముద్ద దిగదు. పండుగ, పబ్బాలతో సంబంధం లేదు. కోడికూర ఎప్పుడు తినాలిపిస్తే.. అప్పుడు దుకాణానికి వెళ్లి చికెన్ తెచ్చుకుని, వంట చేసుకుని ఆరగిస్తేగానీ ఆత్మరాముడు శాంతించడు. ఆదివారమైతే ఇక చెప్పనక్కర్లేదు. చికెన్‌తో ప్రయోగాలు  చేసుకుని తినాల్సిందే. లేకుండా అసలు సండేనే అనిపించదు. ఇంట్లో వండుకోకపోయినా రెస్టారెంట్స్‌కు వెళ్లైనా సరే.. చికెన్ ఐటమ్స్ టచ్ చేయాల్సిందే. కడుపును సంతృప్తి పరచాల్సిందే. కానీ కొన్ని రోజుల నుండి మాంసాహార ప్రియులను భయపెడుతోంది చికెన్ రేట్. మటన్ ధరతో పోటీ పడుతోంది. మార్చిలో తగ్గిన కోడి మాంసం ధర.. ఇప్పుడు అమాంతం పెరుగుతూ సామాన్యులు ఆందోళన చెందేలా చేస్తుంది.

మొన్నటి వరకు ఉపవాస దినాలు, ఆపై రంజాన్ మాస ప్రారంభంతో చికెన్ ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. దీంతో కిలో చికెన్ ధర రూ. 200 నుండి రూ. 220 వరకు పలికేది. ఎప్పుడైతే గుడ్ ఫ్రైడే ముగిసి ఈస్టర్ వచ్చిందో చికెన్ రేటుకు రెక్కలొచ్చాయి. వెంటనే చికెన్ ధర రూ. 290 పెరిగింది. ఇప్పుడు రంజాన్ మాసం పూర్తి కావడంతో రెండు రోజుల నుండి చికెన్ ధర ఆకాశాన్ని తాకుతుంది. కిలో కోడిమాంసం ధర రూ. 100 నుండి 120 వరకు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ చికెన్ ధరలు చూస్తే బోన్ లెస్ చికెన్ రూ. 520లుగా చూపిస్తోంది. ఇక స్కిన్ లెస్ చికెన్ ధర సుమారు రూ. 390గా ఉంది. విత్ స్కిన్ అయితే రూ. 319గా నమోదైంది. ఇక నాటు కోడి కూడా రూ. 550గా ఉంది.

Chicken prices have skyrocketed

ఆదివారం కూడా కిలో చికెన్ రూ. 250 నుండి రూ. 300 లోపు ఉండగా.. ఇప్పుడు ఏకంగా రూ. 390కి చేరింది. దీంతో చికెన్ ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలకు రంజాన్ పండుగ కావడం, పెళ్లిళ్ల సీజన్, అలాగే సమ్మర్ ఎఫెక్ట్ అని చెబుతున్నారు పౌల్ట్రీ వ్యాపారులు. ఎండకు కోళ్లు చనిపోవడం, మార్కెట్‌లో చికెన్‌కు భారీ డిమాండ్ పెరగడం వల్ల రేటు పెరిగినట్లు చెబుతున్నారు. కోళ్లు చనిపోకుండా ఉండేందుకు కూడా ఎయిర్ కూలర్స్ ఏర్పాటు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రంజాన్ పండుగ నాడు ఈ ధరలు ముస్లిం సోదరులను షాక్‌కు గురి చేస్తున్నాయి. అయితే సమ్మర్ ఇలాగే కొనసాగితే.. ఈ ధరలు మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ ధరతో రెస్టారెంట్లలో చికెన్ మెనూలో కూడా రేట్లు పెరిగినట్లు తెలుస్తోంది.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి