iDreamPost

చికెన్ అంటే ఇంత ఇష్టమా? బర్డ్ ఫ్లూ పుకారు ఉన్నా.. కొండెక్కిన చికెన్ ధర!

చికెన్ లవర్స్ కు భారీ షాక్. చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఓ వైపు బర్డ్ ఫ్లూ పుకార్లు వస్తున్నప్పటికీ చికెన్ ధరలు మాత్రం రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే.

చికెన్ లవర్స్ కు భారీ షాక్. చికెన్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ఓ వైపు బర్డ్ ఫ్లూ పుకార్లు వస్తున్నప్పటికీ చికెన్ ధరలు మాత్రం రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే.

చికెన్ అంటే ఇంత ఇష్టమా? బర్డ్ ఫ్లూ పుకారు ఉన్నా.. కొండెక్కిన చికెన్ ధర!

పెరిగిన చికెన్ ధరలు మాంసం ప్రియులకు షాకిస్తున్నాయి. ముక్క లేనిదే ముద్దదిగని వారు పెరిగిన చికెన్ ధరలతో బెంబేలెత్తుతున్నారు. ఒక్కసారిగా చికెన్ ధరలు ఆకాశాన్నంటుతుండడంతో చికెన్ కొనేందుకు వెనకడుగు వేయాల్సిన పరిస్థితి తలెత్తుతోంది. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే.. కోళ్లకు బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతున్నప్పటికీ చికెన్ ధరలు పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సాధారణంగా బర్డ్ ఫ్లూ సోకితే కోళ్లు వేల సంఖ్యలో మృత్యువాత పడుతుంటాయి. ఈ సమయంలో చికెన్ తినేందుకు ప్రజలు భయపడిపోతుంటారు. పౌల్ట్రీ ఫాం యజమానులు ఫ్రీగా కోళ్లను ఇస్తామన్నా కూడా తీసుకునేందుకు నిరాకరిస్తుంటారు మాంసం ప్రియులు. మరి అలాంటిది ఓ వైపు బర్డ్ ఫ్లూ పుకార్లు వ్యాపిస్తున్నప్పటికీ చికెన్ ధరలు మాత్రం కొండెక్కి కూర్చుంటున్నాయి.

ఇటీవల కేజీ చికెన్ ధర రూ. 200 పలుకగా ఉన్నట్టుండి భారీ మొత్తంలో పెరిగిపోయింది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో కేజీ చికెన్ ధర రూ. 300 పలుకుతోంది. ధరలు పెరగడంతో కేజీ కొనాల్సిన చోట పావు కేజీ, అరకేజీలతో సరిపెట్టుకుంటున్నారు వినియోగదారులు. ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. డిమాండ్ కు తగ్గట్లుగా కోళ్ల సరఫరా లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. బర్డ్ ఫ్లూ ఆందోళన కలిగిస్తున్నప్పటికీ చికెన్ ధరలు మాత్రం తగ్గేదేలే అంటున్నాయి. ఇది తెలిసిన వారు చికెన్ అంటే ఇంత ఇష్టమా.. బర్డ్ ఫ్లూ పుకారు ఉన్నా.. ధరలు పెరిగినా.. కొనడం మానట్లేదు.. తినడం మానట్లేదు అంటూ చర్చించుకుంటున్నారు.

ప్రస్తుతం శుభకార్యాల సీజన్ కొనసాగుతోంది. వేల సంఖ్యలో పెళ్లిల్లు జరుగుతున్నాయి. దీంతో చికెన్ కు భారీగా డిమాండ్ పెరిగింది. డిమాండ్ కు తగ్గట్లుగా మాంసం ఉత్పత్తి లేకపోవడం కూడా ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయంటున్నారు వ్యాపారులు. రానున్న రోజుల్లో చికెన్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కేజీ చికెన్ ధర 300 పలుకుతోంది. కేజీ బోన్ లెస్ చికెన్ ధర రూ. 340, స్కిన్ లెస్ చికెన్ ధర రూ. 320, చికెన్ లివర్ ధర రూ. 260, లైవ్ చికెన్ రూ. 260, దేశీ చికెన్ రూ. 420కి చేరింది. ఇక విజయవాడలో సైతం చికెన్ ధరలు రికార్డ్ స్థాయికి చేరుకుంటున్నాయి. కేజీ చికెన్ ధర రూ. 230, బోన్ లెస్ చికెన్ రూ.270, స్కిన్ లెస్ రూ. 250, లివర్ రూ. 190, లైవ్ చికెన్ రూ. 150 పలుకుతోంది. చికెన్, మటన్ రేట్లతో పాటు కూరగాయల ధరలు కూడా పెరుగుతుండడంతో వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి